వివాదంలో బాలీవుడ్ స్టార్ పెళ్లి కొడుకు

Sun Jan 13 2019 10:20:36 GMT+0530 (IST)

దేశ వ్యాప్తంగా విశేష ఆధరణ దక్కించుకున్న కాఫీ విత్ కరణ్ షోలో తాజాగా టీం ఇండియా క్రికెటర్స్ హార్థిక్ పాండ్య మరియు రాహుల్ లు అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమైన విషయం తెల్సిందే. అమ్మాయిలపై కామెంట్స్ చేసినందుకు జీవితంలోనే పెద్ద శిక్షను వారు ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరం అయిన ఆ ఇద్దరు క్రికెటర్లు భవిష్యత్తులో కూడా క్రికెట్ కు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వారిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే గతంలో బాలీవుడ్ స్టార్స్ కొందరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ 2011లో ఇదే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సందర్బంగా అనుష్కపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కరీనా కపూర్ ను స్విమ్ సూట్ లో చూసినప్పుడు చిన్నతనంలోనే మూడ్ వచ్చేదంటూ అసభ్యంగా మాట్లాడాడు. అదే విధంగా అనుష్క గురించి మాట్లాడుతూ అనుష్కకు గిల్లించుకోవాలని ఉంటే - గిల్లేందుకు తనకేం అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో రణ్ వీర్ చేసిన వ్యాఖ్యలపై పెద్దగా దుమారం రేగలేదు. కారణం సోషల్ మీడియా అప్పట్లో ఇంత బలంగా లేదు. ఇటీవలే దీపిక పదుకునేను పెళ్లి చేసుకుని హ్యాపీ మూడ్ లో ఉన్న రణ్ వీర్ సింగ్ కు ఇదో పెద్ద తలనొప్పిలా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అవ్వడంతో పాటు - చిన్న వ్యాఖ్య చేసినా కూడా పెద్ద దుమారం రేగుతోంది. అందుకే అప్పటి వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు వైరల్ చేస్తున్నారు. రాహుల్ - పాండ్య వ్యాఖ్యల కారణంగా గతంలో బాలీవుడ్ స్టార్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వెదికి వెదికి కొందరు వాటిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరెందరు వివాదాస్పదం అవుతారో చూడాలి.