Begin typing your search above and press return to search.

హీరోయిన్ పీకపై కట్టప్ప కత్తి

By:  Tupaki Desk   |   22 Jun 2017 6:26 AM GMT
హీరోయిన్ పీకపై కట్టప్ప కత్తి
X
బాహుబలి2 సెన్సేషనల్ విక్టరీ సాధించింది. హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు దర్శక నిర్మాత కరణ్ జోహార్. నిజానికి సెకండ్ పార్ట్ విషయంలో నిర్మాతలకు-కరణ్ కు రేటు కుదర్లేదని.. జస్ట్ కరణ్ జోహార్ బ్రాండ్ ను మాత్రమే వినియోగించుకున్నారని.. ఇందుకోసం 10 శాతం వాటా చొప్పున.. 25 కోట్ల రూపాయలకు పైగా కరణ్ అందుకున్నాడనే వార్తలు కూడా ఉన్నాయి.

రీసెంట్ గా బాహుబలి2 మూవీ 50 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా.. కరణ్ జోహార్ ముంబైలో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. తన ఇంట్లోనే ఇచ్చిన ఈ పార్టీకి బాహుబలి టీంతో పాటు.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక్కడ బాహుబలి ప్రాపర్టీస్ ను కూడా కొన్ని ఉంచారు. వీటిలో అమరేంద్ర బాహుబలిని చంపేందుకు గాను కట్టప్ప ఉపయోగించిన కత్తిని తీసుకుని యంగ్ హీరో వరుణ్ ధావన్ అల్లరి చేసేశాడు. రాజశేఖర్ తో విలన్.. బాలకృష్ణతో పరమ వీర చక్ర వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ బ్యూటీ నేహాధూపియా పీకపై.. కట్టప్ప కత్తిని ఉంచి.. ఆమె పీక కోసేస్తున్నట్లుగా ఓ పోజ్ ఇచ్చిన వరుణ్ ధావన్.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

హీరోహీరోయిన్స్ ఇచ్చిన ఈ పోజ్ కి ఇంటర్నెట్ లో మంచి అప్లాజ్ వచ్చింది. ఇదే కత్తితో ప్రభాస్ ను చంపేస్తున్నట్లుగా ఇప్పటికే వరుణ్ ఓ ఫోటోతో సోషల్ మీడియాలో హంగామా బాగానే చేసేస్తున్నాడు. బాహుబలి మాత్రమే కాదు.. బాహుబలి ఆయుధాలు కూడా ఎంత పవర్ ఫుల్లో కదా!