Begin typing your search above and press return to search.

యే దిల్ హై ముష్కిల్..సెంటిమెంట్ పండించేశారు

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:29 PM GMT
యే దిల్ హై ముష్కిల్..సెంటిమెంట్ పండించేశారు
X
బాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా నిలిచిన మూవీ యే దిల్ హై ముష్కిల్. ఏళ్ల తర్వాత ఐశ్వర్యా రాయ్ అల్ట్రామోడర్న్ అవతారం ఎత్తేసిందని.. తన కంటే పదేళ్లు చిన్నోడయిన కుర్రాడితో రెచ్చిపోయి మరీ ఇంటిమేట్ సీన్స్ చేసేసిందని హంగామా నడిచింది. విడుదల తేదీ వరకూ ఆగి.. సరిగ్గా రిలీజ్ కి రెండ్రోజుల ముందు అబ్బే ఇలాంటివేమీ లేవని ఐష్ చెప్పినా.. బోలెడంత ఆసక్తి జనరేట్ అయింది అక్కడే.

స్టోరీ పరంగా చెప్పేసుకుంటే.. యే దిల్ హై ముష్కిల్ చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో.. అక్కడ ఆశించినది దొరక్క వేరే అమ్మాయితో రిలేషన్ కూడా పెట్టేసుకుంటాడు. ఆ సమయంలో తన లవర్ ను తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడమే ఈ చిత్ర కథ. కానీ దీనికి కరణ్ జోహార్ స్టైల్ తోడవడంతోనే అసలు గ్లామర్ వచ్చేసింది.

అటు అనుష్క శర్మ రోల్ ని గ్లామర్ కం పెర్ఫామెన్స్ తోను.. ఇటు ఐశ్వర్యారాయ్ పాత్రను పొయెటిక్ గాను తీర్చిదిద్దడంలో కరణ్ జోహార్ సక్సెస్ అయ్యాడు. చివర్లో మెలో డ్రామా బాగా ఎక్కువైపోయినట్లుగా అనిపించినా.. ఇలాంటి ఎమోషన్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు బాగానే నచ్చేసే ఛాన్స్ ఉంది. యే దిల్ హై ముష్కిల్ విషయంలో డైరెక్టర్ కరణ్ జోహార్ ను.. రైటర్ కరణ్ జోహార్ ఏ రేంజ్ లో డామినేట్ చేశాడో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/