Begin typing your search above and press return to search.

అడివి శేష్.. గూడఛారి

By:  Tupaki Desk   |   30 July 2016 8:22 AM GMT
అడివి శేష్.. గూడఛారి
X
‘క్షణం’ సినిమాతో ఒక్కసారిగా అడివి శేష్ ఇమేజే మారిపోయింది. అప్పటిదాకా చాలా వరకు క్యారెక్టర్ రోల్స్‌ తోనే నెట్టుకుంటూ వచ్చాడు శేష్. కానీ ఈ సినిమాతో అతడికంటూ ఓ గుర్తింపు వచ్చింది. స్వయంగా ‘క్షణం’ సినిమాకు స్క్రిప్టు కూడా అందించడంతో అతడి మీద తెలుగు ప్రేక్షకులకు రెస్పెక్ట్ ఏర్పడింది. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అందించినందుకు శేష్ మీద ప్రశంసల జల్లు కురిసింది. ‘క్షణం’లో అతడి పెర్ఫామెన్స్ కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి హడావుడి పడిపోలేదు శేష్. కొంచెం టైం తీసుకుని తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ రోజు తన కొత్త సినిమా పేరు కూడా అనౌన్స్ చేశాడు శేష్.

గూడఛారి.. ఇది శేష్ కొత్త సినిమా టైటిల్. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేయబోతుండటం విశేషం. రాహుల్ పాకాల-శశికిరణ్ తిక్కా అనే డైరెక్టర్ డ్యూ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. శేష్ తర్వాతి చిత్రాన్ని తనే ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. శేష్ ఆ విషయాన్ని కూడా కన్ఫమ్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సంగతి శేష్ వెల్లడించలేదు. ఐతే మొన్న అభిషేక్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో మాత్రం ‘క్షణం’లో శేష్ కు జంటగా నటించిన ఆదా శర్మనే హీరోయిన్ అని పేర్కొన్నాడు.