Begin typing your search above and press return to search.

గుట్టుచప్పుడు కాకుండా గూడచారి తంత్రం

By:  Tupaki Desk   |   22 May 2019 10:37 AM GMT
గుట్టుచప్పుడు కాకుండా గూడచారి తంత్రం
X
ఒకవైపు సినిమాకు ప్రమోషన్లు ఎంత కీలకంగా మారాయో చూస్తున్నాం. షూటింగ్ ఓపెనింగ్ మొదలుకుని సినిమా ఓ రెండు వారాలు ఆడే దాకా ఏదో ఒకరకంగా మీడియాలో నానితే తప్ప జనం గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంది. అలాంటిది గుట్టు చప్పుడు కాకుండా ఏ అప్ డేట్ ఇవ్వకుండ అడవి శేష్ ఓ మూవీ పూర్తి చేశాడు. పివిపి నిర్మాణంలో రెజినా హీరొయిన్ గా ఒక థ్రిల్లర్ ని చకచకా తీశాడట.

ఒకేసారి ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు ప్రకటించే విధంగా ముందే ప్లాన్ చేసుకోవడంతో ఇన్నాళ్ళు దీని వివరాలు ఎవరికి తెలియకుండా పోయాయి. సో శేష్ కొత్త సినిమా ఈ ఏడాదిలో విడుదల ఉంటుందా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ ఇంకో రెండు మూడు నెలల్లో దీన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి

అడవి శేష్ దీని కన్నా ముందు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు. పోయిన సంవత్సరం తనకు పెద్ద బ్రేక్ గా నిలిచిన గూడచారి సీక్వెల్ తో పాటు మహేష్ బాబు సోనీ సంస్థల సంయుక్త నిర్మాణంలో మేజర్ కూడా చేస్తున్నాడు. ఈ రెండు కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ లోపు మరీ ఎక్కువ గ్యాప్ అనిపించకుండా శేష్ పైన చెప్పిన థ్రిల్లర్ పూర్తి చేసినట్టు సమాచారం. హడావిడి పడకుండా ఒక్కొక్క సినిమాను జాగ్రత్తగా ఎంచుకుంటున్న శేష్ క్షణం తర్వాత మంచి మార్కెట్ తెచ్చుకున్నాడు. గూడచారి సక్సెస్ తో అది బలపడింది