2 స్టేట్స్ ఏంటో తెలిసిపోయాయ్

Fri Mar 23 2018 10:04:27 GMT+0530 (IST)

హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 2స్టేట్స్ ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ అనుకున్న దగ్గర నుంచి చాలానే పేర్లు వినిపించాయి. వెంకటేష్ నుంచి సునీల్ వరకూ పలువురు ఆసక్తి చూపించిన ఈ రీమేక్ లో.. అడివిశేష్ హీరోగా ఫైనల్ అయ్యాడు. ఇప్పుడు సినిమా ప్రారంభానికి ఆహ్వానిస్తూ ఇన్విటేషన్స్ కూడా పంపేశారురెండు విభిన్న ప్రాంతాలకు చెందిన వ్యక్తుల వ్యక్తిత్వాలు.. వారు కలవడం అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. హిందీలో గుజరాతీ అండ్ మద్రాసీ అనే థీమ్ తో మూవీని రూపొందించగా..  తెలుగుకు వచ్చేసరికి నేటివిటీ టచ్ ఇచ్చారు. ఇక్కడ అబ్బాయి హైదరాబాదీ కాగా.. అమ్మాయి బెంగాల్ వాసి. మధ్యలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ను నిలబెట్టి.. డిజైన్ చేసిన పోస్టర్ బాగుంది. మూవీ షూటింగ్ ప్రారంభానికి ఇన్విటేషన్ ను స్వయంగా రిలీజ్ చేశాడు అడివి శేష్. మార్చ్ 24వ తేదీన.. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం 8 గంటలు ముహూర్తం షాట్ తీయనుండగా.. అందరికీ ఆహ్వానం అంచారు.

వెంకట్ కుంచం దర్శకత్వంలో తెరకెక్కనున్న 2స్టేట్స్ చిత్రం ద్వారా హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు తను చాలా సంతోషిస్తున్నానని చెబుతున్నాడు అడివిశేష్. అరంగేట్రంలోనే పెర్ఫామెన్స్ చాలానే స్కోప్ ఉన్న రోల్ శివానికి దక్కడం చెప్పుకోవాల్సిన విషయం.