Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ ఆమెతో కంట‌త‌డిపెట్టించాడ‌ట‌!

By:  Tupaki Desk   |   21 Jan 2017 11:19 AM GMT
ఆ డైరెక్టర్ ఆమెతో కంట‌త‌డిపెట్టించాడ‌ట‌!
X
మ‌ణిర‌త్నం.. ఈ పేరు విన‌గానే సెన్సిబుల్ సినిమాలు గుర్తొస్తాయి. ఆయ‌న సినిమాల‌కు ఒక బ్రాండ్ ఉంటుంది. ఎంచుకున్న క‌థాంశాన్ని సూటిగా స్ప‌ష్టంగా బ‌లంగా భావ‌గర్భితంగా చెప్ప‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం డ్యూయెట్‌. ఇందులో కార్తీ హీరోగా న‌టిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అదితీరావ్ హైద‌రీ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఆశ్చ‌ర్యం ఏంటంటే... బాలీవుడ్ లో సెక్సీ ఇమేజ్ ఉన్న తార‌ను త‌న సినిమాకి హీరోయిన్ గా మ‌ణిర‌త్నం ఎంపిక చేసుకోవ‌డం! రాజ్ 3 చిత్రంలో అందాల ఆర‌బోత‌తోనే బాగా పాపుల‌ర్ అయింది అదితి. ఆ త‌రువాత, ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల ద్వారా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. హాట్ గాళ్ ఇమేజ్ ఉన్న అదితిని త‌న డ్యూయెట్ హీరోయిన్ గా ఎంపిక చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు ద‌ర్శ‌కుడు. మ‌ణిర‌త్నం నుంచి ఆఫ‌ర్ అన‌గానే తానూ న‌మ్మ‌లేక‌పోయా అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో అదితి చెప్పింది.

మ‌ణిర‌త్నం సినిమాలో అవ‌కాశం త‌న అదృష్టం అని అదితి చెప్పింది. ఆయ‌న క‌థ చెప్ప‌డం మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర నుంచీ త‌న‌ని తాను మైమ‌ర‌చిపోయాన‌నీ, నేరేష‌న్ పూర్త‌య్యే స‌రికి త‌న క‌ళ్లు చెమ్మ‌గిల్లాయ‌నీ, ఎంత ఆపుకున్నా కూడా క‌న్నీళ్లు ఉబికి వ‌చ్చేశాయ‌ని అంటోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నా అని చెప్పంది. నిజ‌మేగా.. ఈ సినిమా విడుద‌ల త‌రువాత ఆమె ఇమేజ్ వేరే ర‌కంగా ఉండొచ్చు! మ‌ణిర‌త్నం సినిమాతో ఒకేసారి టాప్ రేంజికి వెళ్లిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు క‌దా. ఇప్పుడు అదితి ఆశ కూడా ఇలానే ఉన్న‌ట్టుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/