లావణ్య - అదితీ దోచారు పో!

Tue Dec 18 2018 22:08:55 GMT+0530 (IST)

ఇద్దరు అందాల భామల సరసన నటించాడు వరుణ్ తేజ్. అదితీరావ్ హైదరీ లావణ్య త్రిపాఠి లాంటి అందగత్తెలు అంతరిక్షం సినిమాలో నటించారు. నేటి సాయంత్రం ప్రీరిలీజ్ వేడుకకు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక ఆద్యంతం ఈ ముద్దుగుమ్మల వల్లనే గ్లామర్ వచ్చింది. లావణ్య త్రిపాఠి ట్రెడిషనల్ డిజైనర్ డ్రెస్ లో కనిపిస్తే - అంతే సంప్రదాయ బద్ధంగా అదితీరావ్ హైదరీ చీరలో వచ్చి మతి చెడగొట్టింది.ఇక అంతకుమించి తెలుగులో మాట్లాడి ఈ ముద్దుగుమ్మలిద్దరూ మైమరిపించారు. లావణ్య త్రిపాఠి వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ అహూతులకు ముద్దొచ్చేసింది. ``వారం వారం సినిమాలొస్తున్నాయి. .. ఈ వారం అంతరిక్షం చాలా స్పెషల్ మూవీ. ఇందులో నటించడం గౌరవంగా ఉంది. వరుణ్ తో మళ్లీ నటించడం చాలా సంతోషంగా ఉంది. వరుణ్ చాలా బాగా చేశాడు..`` అంటూ లావణ్య మాట్లాడింది.

అతిదీరావ్ మాట్లాడుతూ.. తన టీమ్ మొత్తాన్ని ఆకాశానికెత్తేసింది. ఆస్ట్రొనాట్స్ రియల్ లైఫ్ హీరోస్.. అంటూ పొగిడేసింది. దర్శకుడు సంకల్ప్ - వరుణ్ తేజ్ వల్లనే ఇది సాధ్యమైందని పొగిడేసింది. ఇక ఇదే వేదికపై చరణ్ క్రిష్ వంటి ప్రముఖులు ఆ ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఆకాశానికెత్తేశారు. అతిదీరావ్ నటనకు ఫిదా అయిపోయానని చరణ్ పొగిడేయడం హైలైట్. అంతరిక్షం చిత్రంలో లావణ్య త్రిపాఠి వరుణ్ కి లవర్‌గా నటిస్తే అదితీ కొలీగ్ పాత్ర పోషించింది.