ఈసారి అలా సమ్మోహన పర్చబోతుంది

Thu Dec 06 2018 11:46:28 GMT+0530 (IST)

తెలుగు ప్రేక్షకుల కు సమ్మోహనం చిత్రం తో పరిచయం అయిన అదితి రావు హైదరీ మంచి ప్రతిభ ఉన్న నటి అంటూ మొదటి సినిమాతోనే నిరూపించుకున్న విషయం తెల్సిందే. మొదటి సినిమానే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తమిళం మరియు తెలుగు లో ఈమె వరుసగా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈమె తాజా గా తనకు ఇష్టమైన సింగింగ్ కూడా చేస్తోంది. తమిళంలో ఇప్పటికే హీరోయిన్ గా మెప్పించిన ఈమె ఈసారి సింగర్ గా ఎంట్రీ ఇచ్చి అలరించేందుకు సిద్దం అయ్యింది.వసంత బాలన్ దర్శకత్వంలో ‘జైల్’ అనే చిత్రం ప్రస్తుతం రూపొందుతోంది. ఆ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటకు అదితి రావు వాయిస్ అయితే బాగుంటుందని ఆయన భావించి ఆ పాటను పాడివ్వడం జరిగిందట. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మంచి ప్రతిభ ఉన్న నటి అదితి రావు మంచి సింగర్ కూడా అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. హీరోయిన్స్ పాటలు పాడటం చాలా కామన్ అయితే అదిది రావు తమిళనాట అతి తక్కువ సమయంలోనే పాట పాడటం చెప్పుకోదగ్గ పరిణామం.

‘జైల్’ చిత్రంలో పాట పాడటం పై అదితి రావు స్పందించింది. పాట రికార్డింగ్ అవుతున్నంత సమయం కూడా తనకు భయం భయంగానే అనిపించిందని జీవీ ప్రకాష్ ధైర్యం చెప్పి నాతో పాట పాడించ్చాడు. ఆయన ఇచ్చిన ధైర్యం తో పాట పాడాను. తన కు ఈ అవకాశం ఇచ్చినందుకు వసంత బాలన్ కు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు అదితి రావు తెలుగులో వరుణ్ తేజ్ కు జోడీగా ‘అంతరిక్షం’ అనే మూవీలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం అవుతోంది. ఇంకా పలు ఆఫర్లు కూడా ఈమె తలుపు తడుతున్నాయి.