Begin typing your search above and press return to search.

మిస్ ఇండియాకు కథ నచ్చింది!!

By:  Tupaki Desk   |   16 Aug 2017 5:58 AM GMT
మిస్ ఇండియాకు కథ నచ్చింది!!
X
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇజం సినిమాలో హీరోయిన్ గా మెరిసిన మాజీ మిస్ ఇండియా ఆదితి ఆర్య ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచేసింది. ఇజం సినిమా తర్వాత ఒక్క సినిమాతో కూడా రాని ఈ సుందరి తర్వాత ఆఫర్లు బాగానే వచ్చినా కొన్నిటిని వదిలేసుకుందట. అందుకు కారణం ఆమెకు నచ్చిన కథలు రావడం లేదట. బాలీవుడ్ - తమిళ్ సైడ్ కూడా ఈ అమ్మడు అంతగా ఎం ట్రై చేయడం లేదట.

అయితే అనుకోకుండా రీసెంట్ గా తెలుగులో ఓ చిన్న తరహా లవ్ స్టోరీని ఒకే చేసింది అదితి ఆర్య. ఆ సినిమాలో ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయిగా కనిపించబోతుందట. అలాగే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బావుంటుందట. రొమాంటిక్ లవ్ స్టోరీలో ఒక ఐటి ఉద్యోగిగా హీరో హావిష్ తో ప్రేమాయణం కొనసిగించనుందని సినిమా యూనిట్ ద్వారా తెలిసింది. శ్రీరామ్ దర్శకత్వంలో హీరో హావిష్ ఓ సినిమాని ఒకే చేశాడు. రమేష్ వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ కి సంబందించిన సీన్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

విషయం ఏంటంటే.. మిస్ ఇండియా బ్యూటీలు తెలుగులో రెండో సినిమాకు కోట్లు కావాలని అంటున్నారు. అందుకే దిశా పటాని నుండి అదితి ఆర్య వరకు ఆఫర్లు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. కాని ఎక్కడో ఎవరో ఇలా ఆ కోటిని చేతిలో పెట్టేస్తే.. వెంటనే కథ నచ్చింది కాబట్టి సినిమా చేస్తున్నాం అంటున్నారు పాపాయిలు!!