Begin typing your search above and press return to search.

కిస్సుల్లో టాలీవుడ్ ఇమ్రాన్‌ హ‌స్మీలు!!

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:30 AM GMT
కిస్సుల్లో టాలీవుడ్ ఇమ్రాన్‌ హ‌స్మీలు!!
X
కిస్సు కొట్ట‌డంలో టాలీవుడ్ లో ఎంత‌మంది ఇమ్రాన్ హ‌స్మీలు ఉన్నారు? గెస్..! ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి. ఇప్పుడున్న స్టార్ హీరోలెవ‌రూ అందులో అంత క‌ళాకారులేం కాదు. కిస్సుల్ని కొంటెగా కాజేయ‌డంలో.. దోర‌దోర దొండ పెద‌వుల్ని అబ‌గా అందేసుకోవ‌డంలో.. క‌న్నె పిల్ల‌ల గుండెల్ని కొల్ల‌గొట్ట‌డంలో ఉన్న హీరోల జాబితా వేరే ఉంది. ఆ జాబితాలో ఎవ‌రెవ‌రి పేర్లున్నాయి చెప్మా! అంటారా.. క‌చ్ఛితంగా చెప్పి తీరాలి.

ముద్దులు లాగించేయ‌డంలో.. దోర దోర దొంగ ముద్దు అంటూ దోబూచులాడేయ‌డంలో మ‌న కుర్ర‌హీరోల్లో ఓ ఏడుగురి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఏడుగురికి నాయ‌కుడు ఎవ‌రు అంటే న‌వ‌దీప్ పేరు మార్మోగిపోతోంది. న‌వదీప్‌ తో పాటు - గుంటూర్ టాకీస్ సిద్ధు - అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్ చంద్ర‌ - వెంక‌టాద్రి ఎక్స్‌ ప్రెస్ ఫేం సందీప్ కిష‌న్ వీళ్లంతా ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ల‌తో పాటు 24 కిస్సెస్ ఫేం ఆదిత్ కూడా ముద్దుల ఇమ్రాన్ హ‌స్మీల జాబితా లో చేరాడు. మొత్తానికి 24 కిస్సెస్ ప్రీరిలీజ్ వేదిక‌పై ముద్దుల హీరోల గుట్టుంతా ర‌ట్ట‌య్యింది. అర్జున్ రెడ్డి సినిమాతో దేవ‌ర‌కొండ‌, ఆర్‌.ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ నిన్న‌గాక మొన్న వ‌చ్చారు కాబ‌ట్టి కౌంట్‌ లో చివ‌రిలో చేర్చాల్సి వ‌చ్చింది.

ఇంత‌కీ వీళ్లంతా ఎవ‌రెవ‌రిని కిస్ చేశారు? అన్న ధ‌ర్మ సందేహం క‌లిగితే కాస్త డీటెయిల్డ్‌ గా వివ‌రాల్ని ప‌రిశీలించాలి. చంద‌మామ కాజ‌ల్‌ తో పాటు త‌న‌తో న‌టించిన నాయిక‌లంద‌రినీ న‌వ‌దీప్ ఓ రేంజులో ముద్దాడాడు. ఇక యాంక‌ర్ ర‌ష్మీని `గుంటూర్ టాకీస్‌`లో సిద్ధూ వీర‌లెవ‌ల్లో ముద్దాడేశాడు. అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠిని న‌వీన్ చంద్ర‌, త‌న తొలి బ్లాక్‌ బ‌స్ట‌ర్ వెంక‌టాద్రి ఎక్స్‌ ప్రెస్ బ్యూటీ ర‌కుల్‌ ని సందీప్ కిష‌న్ ముద్దుల్లో ముంచెత్తిన‌వాళ్లే. షాలినిని దేవ‌ర‌కొండ‌ - పాయ‌ల్‌ ని కార్తికేయ ఏ లెవ‌ల్లో ముద్దాడారో అంద‌రికీ తెలిసిందే. ఇంత‌కీ వీళ్లు ఆన్ ద స్క్రీన్ ముద్దు పెట్టారా.. ఆఫ్ ద స్క్రీన్ ముద్దు పెట్టారా? అన్న‌ది మాత్రం అడ‌గొద్దు ప్లీజ్!! మొత్తానికి వీళ్లంతా ఆఫ్ ద స్క్రీన్ కూడా ఇమ్రాన్ హ‌స్మీలేన‌ని అర్థం చేసుకున్నారు కాబ‌ట్టే వీళ్ల‌ను 24 కిస్సెస్ ఈవెంట్‌ కి పిలిచార‌న్న‌మాట‌!!