Begin typing your search above and press return to search.

నాని పాట పిండేస్తోందిగా..

By:  Tupaki Desk   |   28 May 2017 10:20 AM GMT
నాని పాట పిండేస్తోందిగా..
X
సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతుంటాయి. ఇంతకుముందు ఆడియో విడుదలకు పెద్ద వేడుక చేసేవాళ్లు. కానీ ఇప్పుడలాంటి వేడుకలకు కాలం చెల్లిపోతోంది. సోషల్ మీడియాలో ఆడియో టీజర్లు వదలడం.. ఆడియోలోని పాటల్లో రెండు మూడు రోజులకొక్కటి రిలీజ్ చేయడం. ఆడియో గురించి జనాల్లో చర్చ జరిగేలా చూడటం.. ఇలా సాగుతోంది వరుస. నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ చిత్ర యూనిట్ కూడా ఇదే ట్రెండు ఫాలో అవుతోంది. ఈ సినిమాలోని ‘అడిగా అడిగా’ అనే పాటకు సంబంధించి మూడు రోజుల ముందు ఓ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ పాట కూడా వచ్చేసింది. ‘ఐ’ సినిమాలో నువ్వుంటే నా జతగా.. ‘సాహసం శ్వాసగా సాగిపో’లో వెళ్లిపోమాకే లాంటి పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది. శ్రీరామ్ టిపికల్ వాయిస్.. చక్కటి లిరిక్స్.. గోపీసుందర్ శ్రావ్యమైన మ్యూజిక్.. తోడై ఈ పాట ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇంత ఫీల్ ఉన్న లవ్ సాంగ్ రాలేదంటే అతిశయోక్తి లేదు. ఈ పాటకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శనివారం సాయంత్రం ఈ పాటను రిలీజ్ చేస్తే.. ఆదివారం ఉదయానికి ఐదు లక్షల హిట్స్ వచ్చాయి ఈ పాటకు. ఈ పాట వింటుంటే.. సినిమాలోనూ మంచి ఫీల్ ఉంటుందనిపిస్తోంది. ఆడియోలోని మిగతా పాటల మీద కూడా అంచనాల్ని పెంచిందీ సాంగ్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/