ఆ సినిమా షూటింగ్ 'సాసా'గుతోంది

Tue May 15 2018 09:00:02 GMT+0530 (IST)

డిఫరెంట్ యాక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. విలన్ గా స్పెషల్ రోల్స్ లో నటనలో అందరి దృష్టిని ఆకర్షించిన శేష్ సొంతంగా కథానాయకుడిగా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. క్షణం సినిమాతో ఇప్పటికే మంచి హిట్ అందుకొని పాపులర్ అయ్యాడు. ఇకపోతే నెక్స్ట్ సినిమాతో కూడా ఇంకా పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం బడ్జెట్ కూడా నిర్మాతలు గట్టిగానే పడుతున్నారు.గూఢచారి అనే డిఫరెంట్ స్పై థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న శేష్ గత కొంత కాలంగా షూటింగ్ ని స్లోగా సాగిస్తున్నట్లు అనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ పై బజ్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ షూటింగ్ లో మాత్రం 'సాసా'గుతోంది అనేలా టాక్ తెచ్చుకుంటోంది. గతంలో హైదరాబాద్ లో షూటింగ్ నిర్వహించారు. ఇక తరువాత షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేసి అక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ షూటింగ్ అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ని హిమాచల్ ప్రదేశ్ కి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

త్వరలోనే అక్కడ కొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నారు. అడివి శేష్ ఈ సినిమాలో స్పై గా కనిపించనున్నాడు. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం టెక్నాలజీని బాగా వాడుతున్నారట. అందుకోసమే సినిమా షెడ్యూల్ లో తేడాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆడివిశేష్ తెలుగు ప్రేక్షకులకు కనిపించి చాలా కాలమవుతోంది మరి గూఢచారి ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి గుర్తుండిపోయే హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.