అస్సలు ఆదా చేయట్లేదు!!

Mon Mar 20 2017 12:53:01 GMT+0530 (IST)

అందానికి అభినయం తోడైతే ఎంతటి ముగ్ధలా ఉంటుందో.. అలాంటి ఆదా శర్మకు ఇప్పటివరకూ కాలం కలిసి రాలేదంతే. మూవీస్ విషయంలో ఈ బ్యూటీ సెలక్షన్ భలే ఉంటుంది. దాదాపుగా ఈమె నటించిన అన్ని సినిమాలు హిట్ అవుతాయ్ కానీ.. వాటితో ఆదాకు దక్కే ప్రయోజనం మాత్రం పెద్దగా ఉండదు. గతేడాది టాలీవుడ్ క్షణం మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఆదా శర్మ కెరీర్ కి ప్లస్ అయిన సినిమాలు కనిపించవు.

అమ్మడి వాలకం.. అందాల ప్రదర్శన చూస్తే.. అస్సలు ఆదా చేసే ఉద్దేశ్యమే లేదనే విషయం అర్ధమయిపోతోంది. మల్టీ కలర్ టాప్.. బ్లూ మినీతో ఓ రేంజ్ వరకు బాగానే కవర్ చేసింది కానీ.. కాలి సోయగాలను మాత్రం ప్రదర్శనకు పెట్టేసి.. తెగ ఆకర్షించేస్తోంది ఆదా శర్మ.అమ్మడి ప్రతిభా పాటవాలకు ఇక్కడ గుర్తింపు దక్కకపోయినా.. బాలీవుడ్ మాత్రం బాగానే రికగ్నైజ్ చేసింది.

రీసెంట్ గా ఈమె నటించిన కమాండో2 మూవీ రిలీజ్ కాగా.. బాగానే ఆడేయడమే కాదు.. ఆదా శర్మ నటనకు మంచి పేరు కూడా తెచ్పిపెడుతోంది. ఇదే ఊపును ఇలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన ఆదా శర్మ.. అందుకు తగిన ఏర్పాట్లను బాగానే చేసుకుంది. రీసెంట్ గా హాట్ లుక్స్ తో ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/