ఫోటో స్టోరి: గొడ్డలి పట్టిన గుండమ్మ!

Tue Feb 12 2019 09:43:21 GMT+0530 (IST)

`అదా కి అదా` సామాజిక మాధ్యమంలో హుషారైన ఫోటోలు - వీడియోలతో యువతరాన్ని హుషారెత్తిస్తున్న అదాశర్మ రెగ్యులర్ బేసిస్ లో ట్రీట్ ని షురూ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ - ఇన్ స్టాలో ఈ అమ్మడు జోరుగానే ఫోటోల్ని షేర్ చేస్తోంది. తాజా ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అదా లుక్ సంథింగ్ స్పెషల్ అంటూ బోయ్స్ కామెంట్లు పెడుతున్నారు.తన ఫోటోకి తానే అదిరిపోయే కామెంట్ ని పోస్ట్ చేసింది. `యాక్స్ మర్డరర్ నుంచి మీకు శుభాకాంక్షలు` అంటూ కొంటెగా కామెంట్ చేసింది. అలాగే ట్విట్టర్ లో తనపై వస్తున్న కామెంట్లకు స్పందిస్తూ .. మీకు నా గురించి తెలిసింది తక్కువే. నేను ఐటెమ్ నంబర్ లో నటిస్తున్నానని ప్రచారం సాగుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇప్పటికి ఏ ఐటెమ్ నంబర్ కి అంగీకరించలేదు.. అని అదా ట్వీట్ చేసింది. నాని జెర్సీ చిత్రంలో ఐటెమ్ నంబర్ చేస్తోందన్న వార్తలకు అదా ఇలా కౌంటర్ ఇచ్చింది.

వేరొక ట్వీట్ లో అదా తన గురించి వెబ్ సైట్లలో రాస్తున్న తప్పుడు రాతలను నిలదీసే ప్రయత్నం చేసింది. నేను నటిస్తున్న సినిమాలకు భారీగా పారితోషికం అందుతోందని వెబ్ సైట్లు రాస్తున్నాయి.. మంచిదే!  నాకు సంతోషమే. నటీమణుల బికినీలపై అదిరిపోయే కామెంట్లు చేస్తూ అందరి అటెన్షన్ ని మీ వైపు తిప్పేసుకుంటున్నారు. నాకైతే షాకింగ్ గా ఉంది. అయినా ఈ మహిళలు బీచ్ లలో బికినీలు ఎందుకు వేసుకుంటారు? అంటూ ఆసక్తికరమైన ప్రశ్నల్ని ట్విట్టర్ మాధ్యమంగా సంధించింది?   మొత్తానికి అదా షార్ప్ షూటర్ లా తూటాల్లా మాటల్ని పేల్చేస్తోంది. ఇలా గొడ్డలి గ్యాంగ్ సభ్యురాలిగా మారి అందరినీ బెదిరించేస్తోంది సుమీ!!