Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అస్సలు ఆదా చేయకే

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:10 AM GMT
ఫోటో స్టోరి: అస్సలు ఆదా చేయకే
X
ప్రస్తుతం చేతిలో కమాండో 2 తప్పించి ఒక్క సినిమా కూడా లేకపోయినా కూడా.. హీరోయిన్ అదా శర్మ మాత్రం ఇంకా కుర్రాళ్ళకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తూనే ఉంది. అమ్మడు ఈ మధ్యన ఎక్కడ కనిపించినా కూడా.. వానా కాలం తాలూకు చల్లదనం అంతా కూడా నిమిషాల్లో ఆవిరి అయిపోతోంది. అదిగో మళ్లీ అదే పని చేసింది.

వివిధ పత్రికల కోసం చేసే ఫోటో షూట్లు అయితే కానివ్వండి.. లేదంటే ఏదైనా ప్రైవేట్ ఈవెంటుకు హాజరు కావడం అవ్వనివ్వండి.. అందాల రాశి అదా శర్మ మాత్రం తన గ్లామర్ లుక్కులతో కనువిందు చేస్తోంది అంతే. అసలు ఈ వేడిమిని రగిల్చే ప్రక్రియలో అమ్మడు ఎక్కడా తగ్గట్లేదు. పెద్దగా తన అందాలను ఆదా చేయట్లేదు. అలా చేయకపోవడంతో చూపరులకు ఆ సొగసులు సూటిగా వచ్చి తాకుతున్నాయి.

పై ఫోటోలో కూడా అమ్మడు యథావిథిగా తాను చేయాల్సిన గ్లామరధర్మాన్ని చేసేసింది. దానితో రాత్రి నుండి చాలామందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అసలు పేజీ తిప్పకుండా కనులార్పకుండా అటే చూస్తున్నారట. మీరూ అదే పనిలో ఉన్నారా? కానివ్వండి!!