Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎంతందంగా వాయిస్తోందో

By:  Tupaki Desk   |   16 March 2018 5:14 PM GMT
ఫోటో స్టోరి: ఎంతందంగా వాయిస్తోందో
X
ఆఫర్స్ లేకుంటే సైలెంట్ గా కూర్చోవడానికి నేటి సినిమా హీరోయిన్స్ అస్సలు ఇష్టపడడం లేదు. ఎంతో కష్టపడి అడుగుపెట్టిన సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ లేకుంటే అవకాశాలు దక్కించుకివడానికి నటీమణులు రెగ్యులర్ దారిలోనే వెళుతూ సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ఆదా శర్మ కూడా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఈ బ్యూటీ పరిచయమైన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తెలుస్కోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆదా శర్మ అవకాశాల కోసం గత కొంత కాలంగా చేయని ప్రయత్నం లేదు. పోటో షూట్స్ కూడా బాగానే రెడీ చేసుకుంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫోటోషూట్ లో అయితే చాలా అందంగా అనిపించింది. ఒక చిన్న ఫ్యాషన్ డ్రెస్ లో కూర్చొని ఉంది. స్పెషల్ ఏమిటంటే.. ఆమె చేతిలో మరో అందమైన గిటార్ ఉంది. ఆదా కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ గిటార్ ని అమ్మడు తన అందంలో ఒక భాగంగా చేసుకుంది. అందంగా గిటార్ వాయిస్తోంది.

సెక్సీగా లెగ్స్ అందాలతో ఓ వర్గం ఆడియన్స్ మతిపోగొడుతూ.. చిరునవ్వుతో అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇతర ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. మరి ఈ సరికొత్త లుక్ తో అయినా ఆదాకి ఆఫర్స్ దక్కుతాయో లేదో చూడాలి.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి