Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆదా గ్లామ‌ర్ కి ఫిదా

By:  Tupaki Desk   |   20 April 2018 10:53 AM GMT
ఫోటో స్టోరి: ఆదా గ్లామ‌ర్ కి ఫిదా
X
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ప‌రిచ‌య‌మైన అదా శ‌ర్మ సోకులు చూస్తే కుర్రాల‌కు నిజంగానే హార్ట్ ఎటాక్ రావాల్సిందే. మ‌త్తెక్కించే లుక్స్ తో అందాల‌ను ఏ మాత్రం దాచుకోకుండా ప్ర‌ద‌ర్శించ‌డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అదా శ‌ర్మ‌. అవ‌కాశాలు రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అదా... త‌న అందాల ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది.

తాజాగా ఓ బ్లూ క‌ల‌ర్ డ్రెస్సులో అందాల ఆస్వాదించ‌మంటూ రెండు ఫోటోల‌ను పోస్టు చేసింది అదా శ‌ర్మ‌. ముందు వీపు మొత్తం చూపిస్తూ... వెన‌క‌కి తిరిగి నిల్చున్న ఫోటోని పెట్టి... ఎవ‌రో క‌నిపెట్ట‌మంటూ అభిమానుల‌ను ఊరిస్తూ ఓ కొంటె ప్ర‌శ్న వేసింది. ఈ ఫోటో చూస్తే అమ్మ‌డు పైన వేసుకున్న పీలిక‌ల టాప్ త‌ప్ప‌ లోప‌ల ఏమీ వేసుకోలేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తూనే ఉంది. దానికి కొన‌సాగింపుగా రెండో ఫోటోని పోస్ట్ చేసిన అదా... ఈ సారి ముందు నుంచి సోయ‌గాల‌ను చూడ‌డంటూ పెద్ద ఆఫ‌రే ఇచ్చింది. ముందు నుంచి ఎద అందాలు క‌నిపించ‌కుండా క‌ప్పేసిన టాప్‌... న‌డుము భాగాన్ని మాత్రం బాగా ఎలివేట్ చేసింది. ముందే రోజూ వ్యాయామాలు చేస్తూ కాపాడుకుంటున్న నాజుకైన న‌డుము... క‌నిపించీ క‌నిపించ‌కుండా కుర్రాల‌ను ఊరించ‌కుండా ఉంటుందా...! ఈ ఫోటోకి తోడు ‘రోజెస్ ఆర్ రెడ్‌... వైలెట్స్ ఆర్ బ్లూ... కంప్లీట్ ఇట్‌! బీ క్రియేటివ్‌’ అంటూ కామెంట్ పెట్టిందీ చిన్న‌ది.

అదా శ‌ర్మ‌... తెలుగులో సినిమా చేసి రెండేళ్లు కావ‌స్తోంది. అడ‌వి శేషు ‘క్ష‌ణం’ సినిమాలో న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న‌పాత్రే చేసి మెప్పించింది అదా. కానీ ఆ త‌ర్వాత ఆమెకెందుకో అవ‌కాశాలు రాలేదు. గ‌త ఏడాది బాలీవుడ్ లో ‘క‌మండో 2’లో మెరిసింది. ఏడాదిగా ఖాళీగా ఉంది. ఎలాంటి డ్రెస్సులోనైనా గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శించ‌డంలో తిరుగులేని అదాకి ఎందుకు అవ‌కాశాలు రావ‌డం లేదో మ‌రి!