ఫోటో స్టొరీ: పుష్కరం తర్వాత కలిసిన జంట!

Sun Sep 23 2018 21:27:40 GMT+0530 (IST)

'దేవదాసు' హీరో ఎవరు అనగానే కొంతమంది జనరల్ గా అందరూ అక్కినేని అంటారు.  ఈ జనరేషన్ వాళ్ళయితే 'దేవదాస్' అనుకొని.. ఇద్దరు కదా అని నాగార్జున - నాని అని పేర్లు చెప్తారు.  ఆ సీనియర్ అక్కినేనికి ఈ జెనరేషన్ అక్కినేని కి మధ్యలో ఒక మోడరన్ 'దేవదాసు' వచ్చాడు పన్నెండేళ్ళ క్రితం.  ఆ హీరోనే ఎనర్జిటిక్ హీరో రామ్.వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాసు' హీరో రామ్ కు.. గోవా బ్యూటీ ఇలియానా కు డెబ్యూ ఫిలిం. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఇద్దరి కెరీర్లో తారాపథంలోకి రివ్వున దూసుకెళ్లాయి.  కానీ అప్పటినుండి ఇప్పటివరకూ ఇద్దరూ కలిసి నటించలేదు. కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే.  చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలవడంతో రామ్ థ్రిల్లయ్యాడు. తనతో దిగిన ఫోటోలను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి "చూడండి.. నన్నీ రోజు ఎవరు సర్ ప్రైజ్ చేశారో.. చాలా రోజుల తర్వాత చిన్ననాటి ఫ్రెండ్ ను కలిసినట్టు అనిపించింది.. హహహ.. లానా గర్ల్ నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది" అంటూ తన ఆనందాన్ని నెటిజనులతో పంచుకున్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ 'హలో గురు ప్రేమ కోసమే' లో నటిస్తుండగా... ఇల్లీ బేబీ మాస్ మహారాజా తాజా చిత్రం 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాతో చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇస్తోంది.