Begin typing your search above and press return to search.

న‌టి ఇంటి వేలానికి నోటీసులు

By:  Tupaki Desk   |   17 March 2018 6:03 AM GMT
న‌టి ఇంటి వేలానికి నోటీసులు
X
దివంగ‌త సీనియ‌ర్ న‌టి శ్రీ‌విద్య గుర్తున్నారా? ద‌ళ‌ప‌తి సినిమాలో ర‌జ‌నీకాంత్ త‌ల్లిపాత్ర‌ను చేసింది ఆమే. ఆ మాట‌కు వ‌స్తే.. అలాంటి పాత్ర‌లెన్నింటినో ఆమె చేశారు. దాదాపు 30 ఏళ్ల‌కు పైనే శ్రీ‌విద్య‌కు సినిమాల‌తో అనుబంధం ఉంది. ప్ర‌ముఖ న‌టిగా రాణించిన ఆమె 2006లో కేర‌ళ రాష్ట్రంలో క్యాన్స‌ర్ తో ఆమె మ‌ర‌ణించారు.

తమిళం.. తెలుగు.. మ‌ల‌యాళం..క‌న్న‌డ చిత్రాల్లో న‌టించిన ఆమె 1966 నుంచి 2000 వ‌ర‌కూ సినిమాల్లో న‌టిస్తూనే ఉన్నారు. ఆమెకు చెన్నై అభిరామ‌పురంలోని సుబ్ర‌మ‌ణియంపురం వీధిలో రెండు అంతస్తుల ప్లాట్ ఉంది. అందులో ప్ర‌స్తుతం డాన్స్ స్కూల్ నిర్వ‌హిస్తున్నారు. ఆ ఇంటికి చాలాకాలంగా ప‌న్ను చెల్లించ‌టం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ భ‌వ‌నంలో నిర్వ‌హిస్తున్న డాన్స్ స్కూల్ ద్వారా వ‌చ్చే అద్దెను ప‌న్ను శాఖ జ‌మ చేసుకుంటోంది.

అయితే.. ఇంటి ప‌న్ను.. వ‌డ్డీ.. వేలం ఖ‌ర్చుల కోసం ఇప్పుడామె ఇంటిని వేలం వేయ‌టానికి అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. 1250 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం క‌లిగిన శ్రీ‌విద్య ఫ్లాట్ ను ఆదాయ‌ప‌న్ను శాఖ వేలం ధ‌ర‌గా రూ.1.17కోట్లుగా నిర్ణ‌యించింది. ఈ నెల 27న ఇంటిని వేలం వేయ‌నున్నారు.

కోలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించిన ఆమె..త‌ర్వాతి కాలంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించారు. ఆమె చివ‌రిద‌శ‌లో మ‌ల‌యాళ న‌టుడు.. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే గ‌ణేశ్ కుమార్ ఆమె బాగోగులు చూసుకున్నారు. ప్ర‌ముఖ సినీ న‌టి ఇంటిని వేలం వేసే బ‌దులుగా.. రాష్ట్ర స‌ర్కారు దాన్నోస్మృతి చిహ్నంగా నిలిపితే బాగుంటుంది. ప్ర‌ముఖ‌ల ఇంటిని కాపాడుకునే క‌న్నా.. ఇలా వేలం వేసి వ‌దిలించుకోవ‌టంపైనే ప్ర‌భుత్వాలు మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. ఏమైనా.. డ‌బ్బున్న మారాజుల‌కు కాస్తంత క‌ళాపోష‌ణ ఉంటే.. శ్రీ‌విద్య ఇంటిని కొనుగోలు చేసి.. దాన్నో స్మృతి చిహ్నంగా మారిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.