పక్కలోకి వచ్చినా చిన్న పాత్రలే ఇస్తారు

Tue Mar 13 2018 21:44:15 GMT+0530 (IST)

యాంకర్ కం యాక్ట్రెస్ అయిన శ్రీలేఖ ఎలియాస్ శ్రీ రెడ్డి మల్లిడి.. ఏ ఫిలిం బై అరవింద్2 వంటి చిత్రాలలో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడీ హైద్రాబాదీ పిల్ల సోషల్ మీడియాలో వైరల్. ఇందుకు కారణం ఆమె మాట్లాడిన మాటలే. చాలామంది మనసుల్లో ఉన్న మాటలను.. చాలా నిష్కర్షగా నిర్మొహమాటంగా బైటపెట్టేసింది. ఏకంగా "ఆఫర్ల కోసం ఎంత మంది పక్కల కింద నలిగాలో.. అలా చేసినా ఆఫర్ వస్తుందో లేదో" అంటూ సంచలన సృష్టించేసింది.క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలానే చెప్పింది శ్రీరెడ్డి. దర్శకుడు.. నిర్మాత.. ఆఖరికి కెమేరామ్యాన్ కూడా హీరోయిన్లను కావాలని అంటారని చెప్పింది. అవకాశాల కోసం వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర పడుకోవాల్సి రావడంతో పాటు.. ఇండస్ట్రీలో బ్రోకర్లుగా వ్యవహరించే హీరోలు కూడా ఉన్నారని అంటోందీమె. పెద్ద హీరోలు.. స్టార్లలో కూడా కొందరు తమను రాజకీయ నాయకుల దగ్గరకు పడుకోడానికి పంపిస్తూ ఉంటారంటూ పెద్ద బాంబే పేల్చింది. ఈ పడుకోవడం అనే కాన్సెప్ట్ కి.. తమిళంలో కాంప్రమైజ్ అనే పదం ఉపయోగిస్తారని.. నేరుగా మీరు కాంప్రమైజ్ కి సిద్ధమా అంటారని చెప్పిన శ్రీరెడ్డి.. తెలుగులో అయితే మీరు కమిట్మెంట్ కి రెడీనా అని అడుగుతారని.. ఇందుకోసం కో-ఆర్డినేటర్లు ఉంటారని చెప్పింది శ్రీ రెడ్డి.

ప్రతీచోటా ఇలాంటి వేధింపులు ఉన్నా.. అన్నిటికీ కాంప్రమైజ్ అయినా.. తెలుగు అమ్మాయిలు అనేసరికి చిన్నచూపు చూస్తారని.. వాడుకున్నాక కూడా హీరోయిన్ పాత్రను ఇవ్వరని.. ఒక రెండు సీన్ల పాత్రనే ఇస్తారని.. ఇస్తే గిస్తే వారికి ఓ చిన్న పాత్రతో సరిపెడతారని అందరికీ 'పక్క' భాషల భామలే కావాలని చెబుతోంది శ్రీ రెడ్డి.