ఫోటో టాక్: క్లీవేజ్ షో టూ హాట్ గురూ

Mon Jun 10 2019 23:00:01 GMT+0530 (IST)

లండను ప్యారిసు బాబులకే లస్ట్ పుట్టాలి. ఆ రేంజులో చెలరేగిపోతోంది స్టార్ డాటర్ సోనమ్ కపూర్. దిల్లీ బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాని పెళ్లాడాక సోనమ్ ఫ్యాషన్స్ పరంగా రూటు మారుస్తుందనే భావించారంతా. కానీ అనూహ్యంగా పెళ్లి తర్వాత అసలు తన స్వేచ్ఛకు హద్దు అన్నదే లేదని ప్రాక్టికల్ గా చూపెడుతోందిలా. తనకు నచ్చినదేదో చేసేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో ఇంకా ఇంకా ఎత్తులకు దూసుకుపోతోంది. అందాల ఆవిష్కరణలో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. అయితే ఈ ఫోటోలో మరీ అంత టూమచ్ గా లేదు కానీ.. సోనమ్ కపూర్ కాస్తంత రొటీన్ కి భిన్నంగా హాట్ అప్పీల్ తోనే కనిపిస్తోంది. ఇలా ఎక్స్ పోజ్ చేయడం ఇటీవల కొత్తేమీ కాదు.. అయితే ఎంపిక చేసుకున్న ఆ డ్రెస్ వల్ల అంతటి అప్పియరెన్స్ వచ్చిందనడంలో సందేహమేం లేదు.బాగా లూజ్ గా ఉన్న ఆ వైట్ షర్ట్ లో అసలే బటన్స్ పెట్టకుండా ఓపెన్ షోస్ ఇస్తోంది. సోనమ్ అందాల హిందోళం యూత్ కి మతి చెడే ట్రీట్ ఇస్తోంది. ఇక బాటమ్ లో సిల్వర్ చమ్కీల పరికిణీ అంతే స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది. ముంబై టు ప్యారిస్.. తనదైన స్టైల్స్ తో మత్తెక్కించే ఈ ముద్దుగుమ్మ మరోసారి స్టైలింగ్& డ్రెస్సింగ్ సెలక్షన్ లో తనదైన ప్రత్యేకతను చాటుకుందనే చెప్పొచ్చు. ఆ షర్ట్ ప్రఖ్యాత `జాక్విమస్` బ్రాండ్. ఆ మిడ్డీ స్కర్ట్ `ఎమిలియా విక్ స్టీడ్ బ్రాండ్.

నిన్నటి మిడ్ నైట్ నుంచి సోనమ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ముంబైలో హోరెత్తిపోతున్నాయి. ఈ వేడుకలకు ఇండస్ట్రీ బెస్ట్ సెలబ్రిటీలంతా విచ్చేశారు. ఇక ఈ వేడుకల్లోనే సోనమ్ అదిరిపోయే డిజైనర్ డ్రెస్ తో మతి చెడగొట్టింది. సోనమ్ సంథింగ్ స్పెషల్.. సంథింగ్ హాట్ గురూ! అంటూ యూత్ కలల లోకంలో విహరించింది అంతే!!