పవన్ మసాజ్ ల కోసం అలా చేస్తాడట

Mon Apr 16 2018 09:57:50 GMT+0530 (IST)

టాలీవుడ్ పరిశ్రమపై జూనియర్ ఆర్టిస్ట్ లు గళం విప్పారు. ఇంతకాలం తమకు దక్కని దన్ను శ్రీరెడ్డి పుణ్యమా అని రావటంతో కాసింత ఆవేశం.. మరికాస్త ఆవేదనతో గళం విప్పుతున్నారు. వారికి వామపక్ష స్త్రీ సంఘాలు అండగా నిలవటంతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.వీరు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా?  లేవా?  అన్నది పక్కన పెడితే.. ఆగ్రహీరోలపై వారు చేస్తున్న ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు.. తెలుగు హీరోలపై వారి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొందరు జూనియర్ ఆర్టిస్ట్ ల కలిసి  ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మహిళా సంఘాల ప్రతినిధులు. ఈ సందర్భంగా కొందరు ఆర్టిస్టులు తమ ఆవేదనను.. ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

నటి శృతి అయితే టాలీవుడ్ హీరోలపైనా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన నలుగురు పెద్దాళ్ల చేతుల్లోనే ఉందని.. వారి పిల్లలు.. మనమళ్లే కానీ మరెవరూ హీరోలు కాకూడదా?  ముఖానికి ముఫ్పై సర్జరీలు చేయించుకొని హీరోలుగా చెలామణి అవుతున్నారంటూ మండిపడ్డారు.

హీరోలన్న వారు హైట్ ఉండాలని.. టాలీవుడ్ అగ్రహీరోల్లో హైట్ ఉన్న హీరోలు ఎంతమందో చూడండన్న ఆమె.. ప్రభాస్ ఒక్కళ్లు హైట్ ఉంటారన్నారు. ఇదే శృతి పవన్ కల్యాణ్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక.. ఆర్థిక దోపిడీపై ఓపెన్ డిబేట్ జరగాలన్నారు. సినిమా పెద్దలంతా దీనికి హాజరైతే తాము చెబుతున్న మాటలకు ఆధారాలు కూడా చెబుతామన్నారు.

"30 సర్జరీలు చేస్తే కానీ హీరోలు కాలేని మొహాలు వారివి. పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ లభిస్తే చాలు. రూ.200కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారు. మసాజ్ కు బెంగాలీ అమ్మాయిలు కావాలి. కానీ మహిళల సమస్యల గురించి వెళ్తే పట్టించుకోరు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఎవరితోనైనా మాట్లాడతా" అంటూ మండిపడ్డారు. 

వీడియో కోసం క్లిక్ చేయండి