ఆ దర్శకుడి దుమ్ముదులిపిన హీరోయిన్

Wed Jun 12 2019 07:00:01 GMT+0530 (IST)

పాత హీరోయిన్ సంగీత గురించి తెలుసా? ఖడ్గం సినిమాతో టాలీవుడ్ లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత  శ్రీకాంత్- వేణు లాంటి హీరోలతో చేసింది.  ఆ తర్వాత  కనుమరుగైంది ఈమె. అయితే తాజాగా ఓ చానెల్ లో పాలుపంచుకుంది. తన వ్యక్తిగత సినీ జీవితాలను వివరిస్తూ సంచలన విషయాన్ని ఒకటి బయటపెట్టింది.మాది సినిమా ఫ్యామిలీ అని హీరోయిన్ సంగీత చెప్పుకొచ్చింది. తాత పెద్ద ప్రొడ్యూసర్ అని.. తమిళంలో 20 సినిమాలు తీశాడని వివరించింది. మా అమ్మ వల్లే సినిమాల్లోకి వచ్చానని.. నాకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండేది అని వివరించింది.

నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక వరుస ఫ్లాపులు తెలుగు తమిళ్ కన్నడలో రావడంతో ఇక ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామని అనుకున్నానని సంగీ తెలిపింది. అయితే ఖడ్గం మూవీలో కృష్ణవంశీ హీరోయిన్ గా ఇచ్చి బ్రేక్ ఇచ్చారని వివరించింది. సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం చూపించే పాత్ర కావడంతో ఆపాత్రను చాలా మంది రిజెక్ట్ చేస్తే తాను మాత్రం చేశానని వివరించింది.

ఒక వదిన మరిది మీద కన్నేసి ఎఫైర్ పెట్టుకొనే కథతో వచ్చిన ఓ తమిళ దర్శకుడిని బాగా తిట్టేశానని సంగీత తెలిపింది. ఇలా అక్రమ సంబంధాలు తాను చేయనని.. ఇలాంటి పాత్రలకు నన్ను అడగవద్దని మన సంస్కృతిలో అది చాలా తప్పు అని దర్శకుడిని తిట్టిపోశానని సంగీత వివరించింది. అది రియల్ జరిగిన సంఘటన అని తెలిపేసరికి షాక్ అయ్యానని వివరించింది. అయితే సైక్రియాటిస్ట్ ను కలిశాక నెగెటివ్ ను నెగెటివ్ గా చూపించే పాత్రల్లో చేయడానికి ఒప్పుకున్నానని సంగీత వివరించింది.