బోల్డ్ స్టార్ ని పోర్న్ స్టార్ చేశారు

Sun Jul 15 2018 22:25:34 GMT+0530 (IST)

ఇంటర్ నెట్ అని దానికి ఎవరు పేరు పెట్టారో కాని దాని వలలో చిక్కి ఎంతో మంది విలవిల్లాడుతున్నారు. అయితే అది కొందరికి పాజిటివ్ అయితే ఎంతో మందికి నెగెటివ్ అవుతోంది. తాజాగా ఇంటర్నెట్ తో తన జీవితంలో ఊహించని మలుపును చూసింది నటి రాజశ్రీ దేశ్ పాండే. ఇపుడు ఆమెపై ఇంటర్నెట్ లో కొత్త ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు ఆ ప్రచారం రాంగ్ పాపులారిటీని తెచ్చిపెడుతోంది.ఇటీవల నెట్ ఫ్లిక్స్ * స్కేర్డ్  గేమ్స్* అని ఒక వెబ్ సిరీస్ మొదలుపెట్టింది. అందులో నవాజుద్దీన్ సిద్ధికీ భార్యగా సుభద్ర పాత్రలో నటించింది రాజశ్రీ. అయితే ఓ సీన్లో ఆమె టాప్‌లెస్‌గా కనిపిస్తోంది. ఈ బోల్డ్ సీన్ ఇపుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ అయ్యింది. సంచలనం అవడం వరకూ బానే ఉంది. ఎందుకంటే ఆమె స్వయంగా ఆ పాత్రకు ఒప్పుకుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే...  అయితే ఆ సీన్ ను అశ్లీల సైట్లలో కొందరు అప్ లోడ్ చేశారు. అంతటితో ఆగిందా? అంటే లేదు. పోర్న్ స్టార్ టాగ్ తో అప్ లోడ్ చేసి ఆమెను పోర్న్ స్టార్ చేసేశారు. ఈ ప్రచారం చూసి ఆమె షాక్ తిన్నది.

  దీనిపై రాజశ్రీ స్పందించింది. *అడల్డ్ స్టార్* వేరు బోల్డ్ యాక్టర్ వేరు. నేను బోల్డ్ గా నటించాను. కథకు అవసరమై ఆ సీన్ చేశాను. ఒక నటిగా పాత్రకు న్యాయం చేస్తే... నా మీద పోర్న్ స్టార్ ముద్ర వేయడం దారుణం అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

అయితే తాను ఏం చేస్తున్నానో - ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. బోల్డ్ సీన్లు చేస్తే ఇలాంటి విమర్శలు - సంఘటనలు ఎదురవుతాయని నాకు తెలుసు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

సేక్రెడ్ గేమ్స్ గురించి...  ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఇటీవల విడుదలైంది. వివాదాస్పదం కూడా అయ్యింది. విక్రమ్ చంద్ర రాసిన ‘ స్కేర్డ్  గేమ్స్’ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇందులో సైఫ్ అలీఖాన్ - రాధికా ఆప్టే - నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించారు.