'సంఘమిత్ర'పై జాలి చూపిన నయన్!

Mon Jun 19 2017 19:28:28 GMT+0530 (IST)

బాహుబలి తరహాలో తమిళంలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం సంఘమిత్ర. చారిత్రక కథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారు నిర్మాతలు. అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు శృతి ప్రకటించడం తెలిసిందే. శృతి ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు బయటకు వచ్చిందనే అంశంపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే సంఘమిత్ర మూవీలో నటించాలని నయనతారను సంప్రదించారట నిర్మాతలు. ఇందుకోసం ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఎలాగైనా ఈ  ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ఓకే చేయాలంటూ నయన్ దగ్గర ప్రాధేయపడినట్లుగా వినికిడి. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోల ఎంపిక విషయంలోనూ నిర్మాతలు మల్లగుల్లాలు పడ్డారట.

ఈ సినిమాలో నటించాలని ప్రిన్స్ మహేశ్ బాబును అడిగారు. నిర్మాతలు రెండేళ్ల షెడ్యూల్ కోరడంతో మహేష్ నో చెప్పారట. తమిళ హీరోలు విజయ్ - అజిత్ లను సంప్రదించినా ఓకే చేయలేదని సమాచారం. కథ అద్భుతంగా ఉన్నా రెండేళ్ల సమయం వల్ల ఆ హీరోలు ముందుకు రాలేదట. చివరికి జయం రవి - ఆర్యలు ఈ సినిమాను ఓకే చేశారు.

ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించినా వారు రిజెక్ట్ చేశారట. ఒకదశలో బాలీవుడ్ హీరోయిన్ ను సంప్రదించి విఫలమయ్యారట. తన కండీషన్లకు ఓకే చెప్పటం - భారీ పారితోషికం - విపరీతంగా ప్రాధేయపడటంతో నయనతార ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇన్ని షరతుల మధ్య నయన్ ఈ ప్రాజెక్టులో ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/