ఫోటో స్టోరి: జాక్విలిన్ కిల్లింగ్ లుక్

Sun Mar 24 2019 21:57:14 GMT+0530 (IST)

శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రంగుల ప్రపంచంలో అడుగు పెట్టిన ఈ సుందరికి ఆరంభం కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకానొక దశలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది జాక్విలిన్. సరిగ్గా అలాంటి టైమ్ లో సల్మాన్ భాయ్ ఇచ్చిన ఓ అవకాశం తనను ఆదుకుంది. భాయ్ ఎంతో ఆప్తుడిగా తనకు ఎంతో సాయం చేశాడు. కెరీర్ పూర్తిగా డైలమాలో ఉన్నప్పుడు జాక్విలిన్ కి వరుసగా అవకాశాలిచ్చి నిరూపించుకునే అవకాశం కల్పించాడు. కిక్ 2 రేస్ 3 వంటి సీక్వెల్ సినిమాల్లో తనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు సల్మాన్. అలాగే వరుణ్ ధావన్ సరసన జుడ్వా 2 చిత్రానికి భాయ్ రికమండేషన్ తోనే జాక్విలిన్ అవకాశం అందుకుంది. పరిశ్రమలో గాడ్ ఫాదర్ గా నిలిచి ఆదుకున్నాడు భాయ్.ప్రస్తుతం జాక్విలిన్ కెరీర్ పరంగా పూర్తి బిజీ. ఓవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే బాలీవుడ్ లో పలు క్రేజీ సినిమాల్లో నాయికగా నటిస్తోంది. 2018 లో రెండు క్రేజీ సినిమాల్లో నటించిన జాక్విలిన్ ఈ ఏడాది ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. `డ్రైవ్` ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు పూర్తి చేసి జూన్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

మరోవైపు  లేటెస్ట్ ఫోటోషూట్లతోనూ జాక్విలిన్ బోయ్స్ లో వేడి పెంచుతోంది. ప్రఖ్యాత ఫెమీనా మ్యాగజైన్ లేటెస్ట్ కవర్ పేజీపై జాక్విలిన్ లుక్ ఎంతో స్పెషల్ గా ఆకట్టుకుంటోంది. అల్ట్రా మోడ్రన్ లుక్ లో జాక్ కట్టి పడేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. దీనికి జాక్విలిన్  ఓ అందమైన కొటేషన్ ని ఇచ్చింది. `సంతోషంగా ఉండు.. నీ జీవితం దానిపైనా ఆధారపడి ఉంది` అనే అర్థవంతమైన క్యాప్షన్  ని ఇచ్చింది. నిజమే .. ఆనందంగా ఉండడమే జీవితం. సంతోషం లేని లైఫ్ ఎవరికైనా వ్యర్థం.