ఫోటో స్టొరీ: అబ్బా అనిపిస్తున్న హెబ్బా

Mon May 20 2019 12:27:52 GMT+0530 (IST)

హెబ్బా పటేల్ చాలా సినిమాలే చేసింది కానీ 'కుమారి 21 ఎఫ్' ఆమెకు తెచ్చిన గుర్తింపు మరే ఇతర సినిమా కూడా తీసుకురాలేదు. ఆ సినిమా తర్వాతా హెబ్బా ను చాలామంది కుమారి అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారంటే ఆ పాత్ర ప్రేక్షకులపై ఎంతగా ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు.  అయితే ఈమధ్య ఈ టాలీవుడ్ కుమారి జోరు కాస్త తగ్గింది. అలా అని సోషల్ మీడియాలో హాట్ ఫోటోల హోరు ఏమాత్రం తగ్గలేదు.తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. బ్రౌన్ కలర్ లో ఉన్న పొడవాటి థై స్లిట్ గౌన్ ధరించి ఒక బెడ్ పై కూర్చుంది. తన గౌన్ బెడ్ ను మొత్తాన్ని కవర్ చేసింది.  ఆఫ్ షోల్డర్ గౌన్ కావడం తో హెబ్బా తన అందాలను ప్రత్యేకంగా వడ్డించే అవసరం కలగలేదు.  అందాలూ వాటిని అవే స్వింగ్ ఆ వడ్డించుకున్నాయి. మెడలో ఒక షార్ట్ నెక్లెస్ ఈ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.  పోనీ టెయిల్ వేసుకొని.. మొహానికి తగిన మేకప్ తో ఒక మోడల్ లాగా రెడీ అయింది. మరి కేన్స్ కు ఆహ్వానం అందలేదని ఇలా తను ఉన్న చోటునే కేన్స్ గా మారుస్తున్నట్టుంది. ఈ ఫోటో ఒక్కటే కాదు హెబ్బా ఇన్స్టా ఖాతాలో దాదాపుగా ఫోటోలు అన్నీ ఇదే రేంజ్ లో హాట్ గా ఉన్నాయి.  

ఈ ఫాలోయర్లు కూడా  పైనున్న ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఇచ్చారు. ఒకరు "కుమారి చాలా హాట్" అని అన్నారు.  మరొకరు "కిల్లర్ పోజు" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సినిమాల విషయానికి వస్తే హెబ్బా లాస్ట్ సినిమా '24 కిస్సెస్' పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది.  ఆ సినిమా తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు. మరి ఆ సినిమా అవకాశాల కోసమే ఈ ఫోటో షూట్లని అర్థం అయింది కదా!