Begin typing your search above and press return to search.

‘మ‌హాన‌టి’ థియేట‌ర్లో హ‌రితేజ‌కి అవ‌మానం

By:  Tupaki Desk   |   18 May 2018 10:00 AM GMT
‘మ‌హాన‌టి’ థియేట‌ర్లో హ‌రితేజ‌కి అవ‌మానం
X
సినిమా... ఓ రంగుల ప్ర‌పంచం. సినిమా ఓ వినోదం. కొంద‌రికి సినిమాలే ప్ర‌పంచం. అయితే సినిమా వాళ్లంటే మాత్రం స‌మాజంలో ఓ చుల‌క‌న. చిన్న చూపు ఉన్న మాట వాస్త‌వం. హీరోల విష‌యం ప‌క్క‌న‌పెడితే హీరోయిన్లు... న‌టీమ‌ణులు మాత్రం సినిమాల్లో న‌టిస్తున్న ఒకే ఒక్క కార‌ణంగా స‌మాజంలో ఎన్నో ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ‘బిగ్ బాస్‌’ కార్య‌క్ర‌మం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హ‌రితేజ‌కి కూడా ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది.

‘మ‌హాన‌టి’ సినిమా చూసేందుకు థియేట‌ర్‌ కి కుటుంబంతో క‌లిసి వెళ్లిన సంద‌ర్భంగా ఎదురైన ఓ సంఘ‌ట‌న‌ని సెల్ఫీ వీడియో రూపంలో షేర్ చేసింది హ‌రితేజ‌. తాను ఏ పాపులారిటీ కోసం ఈ విధంగా చేయ‌ట్లేద‌ని మొద‌ట్లోనే స్ప‌ష్టం చేసిన హ‌రితేజ‌... వీడియో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఏడుస్తూనే క‌నిపించింది. ‘మ‌హాన‌టి’ సినిమా ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కూ చెల్లి ప‌క్క‌న కూర్చున్న‌ హ‌రితేజ...తర్వాత‌ త‌ల్లి ప‌క్క‌న కూర్చొనేందుకు సీటు మారేందుకు లేవ‌డంతో ప‌క్క‌నే ఉన్న ఓ మ‌హిళ‌... అత‌ని ప‌క్క‌న మా అమ్మాయి కూర్చొలేద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేసింద‌ట‌. దానికి తండ్రిలాంటి ఆయ‌న ప‌క్క‌న కూర్చొవ‌డం వ‌ల్ల ఇబ్బంది ఏమిట‌ని ప్ర‌శ్నించాన‌ని చెప్పింది హ‌రితేజ‌. దానికామె ‘మీరంటే సినిమా వాళ్లు ఎవ‌రి ప‌క్క‌నైనా కూర్చుంటారు...’ అని అవ‌మానకరంగా చుల‌క‌న చేసి మాట్లాడింద‌ని చెప్పింది హ‌రితేజ‌.

సినిమా వాళ్ల గురించి... ముఖ్యంగా న‌టీమ‌ణుల గురించి చుల‌క‌నగా మాట్లాడిన ఆ మ‌హిళ‌తో చాలాసేపు వాదించాన‌ని... మ‌గ‌వాళ్ల ప‌క్క‌న కూర్చొని సినిమా చూడం అనుకుంటే థియేట‌ర్ మొత్తం కొనుక్కోపోయారా... మ‌హిళ‌ల‌కి వేసే స్పెష‌ల్ షోకి రాక‌పోయారా... అని నిల‌దీశాన‌ని చెప్పింది. చివ‌ర్లో జ‌నాల‌కు వినోదం పంచుకోవ‌డం కోసం ఎన్నో బాధ‌ల‌నూ... ఇబ్బందుల‌నూ భ‌రిస్తూ పైకి న‌వ్వుతూ న‌టిస్తున్న సినిమా వాళ్ల‌ని కాస్త విజ్ఞ‌త‌తో గౌర‌వించ‌డంటూ వేడుకుంది హ‌రితేజ‌. ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి