హాట్ ఫోటోల ట్రెండ్ పీక్స్ లో ఉందిగా!

Thu Jun 13 2019 07:00:01 GMT+0530 (IST)

సినిమా అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ.  అందుకే హీరోయిన్లు అందంగా ఉండాలి.  ఆ అందాలను వెండితెరపై కనువిందు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అప్పుడప్పుడూ మ్యాగజైన్ కవర్ పేజిలపై తళుక్కుమని మెరవాలి.  అయితే ఈమధ్య ఈ గ్లామర్ షో ట్రెండ్ మారిపోయింది. వెండితెర.. ఫ్యాషన్ మ్యాగజైన్లు మాత్రమే కాదు గ్లామర్ షోలకు సోషల్ మీడియా సరికొత్త కేరాఫ్ అడ్రెస్ గా మారింది.అటు ట్విట్టర్.. ఇటు ఇన్స్టాగ్రామ్ లో అందాల భామలు రెచ్చిపోయి మరీ అందాల ప్రదర్శన చేస్తున్నారు.  ట్విట్టర్ ఊపు కూడా కాస్త తగ్గింది కానీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు గ్లామర్ కు కేరాఫ్ ఆడ్రెస్.  బాలీవుడ్ భామల నుండి టాలీవుడ్ భామల వరకూ ఇప్పుడు ఒకటే పని. రెండు రోజులకొకసారి హాట్ ఫోటో షూట్లు చేయడం.. ఆ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడం.  బాలీవుడ్ లో కత్రినా కైఫ్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన అనన్య పాండే వరకూ ఇదే తంతు. ఈ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ల తో పాటుగా పూనమ్ పాండే.. షెర్లీన్ చోప్రా లాంటి హాటు బాంబులున్నారు.  సెమిన్యూడ్ ఫోటో షూట్లు చేయడమే కాదు.. తమ పేరు మీద సొంత యాప్స్ మొదలుపెట్టి వాటి ద్వారా న్యూడ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ గ్లామర్ ట్రెండ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు. ఫుల్ న్యూడిటీ ని ఇన్స్టా వారు అనుమతించరు కాబట్టి యాప్స్ లో ఉండే న్యూడ్ వీడియోలకు టీజర్లు.. ట్రైలర్లు ఇన్స్టాలో పెడతారు.

మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లు తమ క్రేజును పెంచుకునేందుకు సోషల్ మీడియా ను వాడుకుంటే.. అప్కమింగ్ హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు.. ఫిలిం మేకర్ల దృష్టిలో పడేందుకు గ్లామర్ ఫోటోషూట్లపై ఆధారపడుతున్నారు.  దిశా పటాని విషయమే తీసుకుంటే ఆమె బ్రాండ్ ప్రమోషన్ విషయంలో విప్లవం తీసుకొచ్చింది.  ఇన్నర్ వేర్ బ్రాండ్ కు ప్రమోషన్స్ మొదలుపెట్టి నెటిజనులలో భారీ గుర్తింపు  సాధించింది.

మరోవైపు 40 ప్లస్ భామలైన శిల్పా శెట్టి.. మలైకా అరోరా.. మందిరా బేడి.. అమీషా పటేల్ లాంటి వారు రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఈ వయసులో కూడా అభిమాన గణాన్ని పెంచుకుంటూ ఇంకా లైమ్ లైట్ లోనే ఉంటున్నారు.  సోషల్ మీడియాకనుక లేకుంటే ఈ భామలకు ఈ క్రేజ్ ఉండేదే కాదు.  

ఫేడ్ అవుట్ అవుతున్న భామలకు కూడా లైమ్ లైట్ లో ఉండేందుకు సోషల్ మీడియా కల్పతరువులాగా మారింది.  బీచ్ లో.. స్విమ్మింగ్ పూల్స్ లో బికినీలు ధరించి జలకాలడడం ఆ ఫోటోలను షేర్ చేయడం కామన్ అయింది.  శ్రియ లాంటి భామలు ఫారెన్ వెకేషన్ లకు వెళ్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.  ఏదైతేనేం.. ఓవరాల్ గా ఈ గ్లామర్ ప్రదర్శనలు నెటిజనులను ఉల్లాసపరుస్తూ.. ఉత్సాహపరుస్తూ రకరకాల రోగాలతో.. రొష్టులతో.. మానసిక వేదనలతో బాధలు పడే జనాలకు టెన్షన్లనుండి ఉపశమనాన్ని కలిగిస్తున్నారు.