ఫోటో స్టోరి: లోదుస్తుల్లో `లోఫర్`తనం!!

Sun Feb 17 2019 10:44:51 GMT+0530 (IST)

`లోఫర్` బ్యూటీ దిశా పటానీ వేపకాయంత వెర్రి గురించి తెలిసిందే. పండగల్ని పబ్బాల్ని సైతం తన ప్రచారదాహానికి ఉపయోగించేస్తూ నిరంతరం హాట్ టాపిక్ అవుతోంది. టైమ్ చూసి కొట్టడం ఈ అమ్మడి హ్యాబిట్. అప్పట్లో దీపావళి సందర్భంగా సీకే బ్రాండ్ లోదుస్తులు ధరించి మీ ఇంటికి లక్ష్మీకళ వస్తుంది! అంటూ ప్రచారం చేసి నెటిజనులతో తిట్లు తింది. ఇటీవలే ప్రేమికులరోజు దినోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి చీవాట్లు తినే పని చేసింది. ఈసారి బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో కలిసి కోలా బ్రాండ్ కి ప్రచారం చేసిన దిశా పటానీ టైగర్ తో కలిసి జాయింట్ గా తిట్లు తినాల్సొచ్చింది. ఓవరాల్ గా మూడు తిట్లు ఆరు చీవాట్లు! అన్న చందంగా ఈ అమ్మడి లైఫ్ సాగిపోతోంది. అయితే తాను ఏం ఆశిస్తోందో అది మాత్రం సాధించుకుంటూ.. తనకి కావాల్సిన ఔట్ పుట్ ని నెటిజనుల నుంచి తీసుకుంటోంది. లోఫర్ బ్యూటీకి తిట్లు పడినా ప్రముఖ బ్రాండ్లకు కావాల్సినంత ప్రమోషన్ ఈజీగా దక్కుతోంది.మరోసారి అదే ఫార్ములాని అప్లయ్ చేస్తూ సీకే సిరీస్ ని కొనసాగిస్తోందని తాజాగా రివీల్ చేసిన ఫోటో చెబుతోంది.  ఓవైపు పుల్వామా దాడి ఘటన నుంచి భారతదేశం కోలుకోని సన్నివేశంలో ఉంటే దిశా పటానీ మరోసారి లోదుస్తుల ప్రచారం ప్రారంభించింది. తాజాగా ఇన్ స్టాగ్రమ్ లో ఓపెన్ టాప్ ఫోటోని షేర్ చేసి కుర్రాళ్లను టీజ్ చేసింది. ఓ వైట్ బ్రా ధరించి వెనక్కి తిరిగి ఫోజిచ్చిన ఫోటోని అభిమానులకు షేర్ చేసింది. ఇప్పటికే ఈ ఫోటోని లక్షలాది మంది వీక్షించారు. అయితే నెటిజనుల నుంచి యథావిధిగా ట్రోల్స్ తప్పలేదు.

ఆర్మీ అంటే గౌరవం లేదా? అంటూ పలువురు నెటిజనులు ప్రశ్నించారు. భారతదేశ సైనికులు అంటే నీకు అస్సలు గౌరవం లేదు.. విలువల్లేవ్! అంటూ ఓ నెటిజను ఘాటుగానే స్పందించాడు. `ఓల్డ్ దిశా ఈజ్ బ్యాక్.. ఐ లవ్ యు` అంటూ వేరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. అసలు నీ ధ్యాస ఎక్కడ ఉంది?  నీ హీరో ఎక్కడ ఉన్నాడు? అంటూ ఓ కుర్రాడు కామెంట్ చేశాడు. ఓవరాల్ గా మారోసారి దిశా పటానీ సక్సెసైందన్నమాట!!