Begin typing your search above and press return to search.

రైఫిల్ కి లైసెన్స్.. బాండ్ గాళ్ లా చెల‌రేగుతుందా?

By:  Tupaki Desk   |   20 Sep 2019 12:29 PM GMT
రైఫిల్ కి లైసెన్స్.. బాండ్ గాళ్ లా చెల‌రేగుతుందా?
X
స‌ల్మాన్ భాయ్ నీడ‌లో ఎంద‌రో అంద‌గ‌త్తెలు క‌థానాయిక‌లుగా ప్ర‌మోట‌య్యారు. ఆ జాబితాలో కొరియోగ్రాఫ‌ర్ డెయిసీ షా పేరు పాపుల‌ర్ అయ్యింది. కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య వ‌ద్ద డ్యాన్స్ అసిస్టెంట్ గా ప‌నిచేసే క్ర‌మంలో డెయిసీ స‌ల్మాన్ కి స్నేహితురాలు అయ్యింది. `జ‌య‌హో` చిత్రంతో తొలి అవ‌కాశం ఇచ్చింది స‌ల్మాన్. ఆ త‌ర్వాత హేట్ స్టోరి 3- రేస్ 3 చిత్రాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత ప‌లు భాష‌ల్లో క‌థానాయిక‌గా న‌టించింది.

తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో అఛీవ్ మెంట్ సాధించింది. రైఫిల్ షూటింగ్ త‌న ఫేవ‌రెట్ క్రీడ‌. తాజాగా అందుకు లైసెన్స్ పొందింది. నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా నుంచి ఆ మేర‌కు స‌ర్టిఫికెట్ అందుకుంది. తొలి నుంచి డైసీకి రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. ప్రొఫెష‌న‌ల్ షూట‌ర్ అవ్వాల‌న్న కోరిక ఉంది. 2017 నుంచి రైఫిల్ షూటింగ్ ని నేర్చుకుంటోందిట‌.

త‌న‌కు స‌ల్మాన్ భాయ్ మంచి స్నేహితుడు కాబ‌ట్టి తాజా అచీవ్ మెంట్ కి డెయిసీకి శుభాకాంక్ష‌లు తెలిపాడు. డెయిసీ రైఫిల్ ప‌ట్టుకుని షూట్ చేస్తున్న ఫోటోని షేర్ చేసిన భాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. ``ఇది స‌రే.. ఇక‌పై ప‌థ‌కం సంపాదించ‌డంపై దృష్టి సారించు!`` అని ఆశీస్సులు అందించాడు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఓ గుజ‌రాతీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. షూటింగ్ అనేది అరుదైన క‌ళ‌. ఆ విద్య‌లో ఆరితేరుతోంది కాబ‌ట్టి.. డైసీ షా ఇక‌పై బాండ్ గాళ్ త‌ర‌హాలో పెద్ద తెర‌పైనా చెల‌రేగుతుందేమో. హిందీ-మ‌ల‌యాళం- గుజ‌రాతీ చిత్రాల్లో కెరీర్ ని సాగిస్తున్న ఈ బ్యూటీకి ఇక‌పై స్పై త‌ర‌హా ఆఫర్లు వెంట‌ప‌డ‌తాయేమో.