Begin typing your search above and press return to search.

డ‌బ్బు కోసం వారు వ్య‌భిచారం చేశారు:అపూర్వ‌

By:  Tupaki Desk   |   17 Jun 2018 6:25 AM GMT
డ‌బ్బు కోసం వారు వ్య‌భిచారం చేశారు:అపూర్వ‌
X
అమెరికాలో వివిధ ర‌కాల ఈవెంట్ల ముసుగులో కొంద‌రు హీరోయిన్ల‌తో జ‌రుగుతోన్న హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టుర‌ట్టు కావ‌డం టాలీవుడ్ లో తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ప‌లువురు హీరోయిన్లను కిషన్ మోదుగుమూడి - చంద్ర‌క‌ళ దంపతులు ఈవెంట్స్ పేరుతో అమెరికాకు పిలిపించి వ్యభిచారం చేయిస్తోన్న వైనంతో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో పెను దుమారం రేగింది. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారంపై ఓ తెలుగు న్యూస్ చానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్రమంలో న‌టి అపూర్వ‌ - న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ పాల్గొన్న సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆ సెక్స్ రాకెట్ లో భాగ‌స్వాములైన కొంద‌రు హీరోయిన్ల‌పై అపూర్వ షాకింగ్ కామెంట్స్ చేశారు. డ‌బ్బుల కోసం కొంద‌రు న‌టీమ‌ణులు - హీరోయిన్లు వ్యభిచారం చేసేందుకు వెనుకాడ‌రని - అటువంటి వారినే ఆర్గ‌నైజ‌ర్లు సంప్ర‌దించి `చీక‌టి`ఒప్పందం చేసుకుంటార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ హీరోయిన్ల‌కు తెలియ‌కుండానే ఇలా జ‌రుగుతుందా? డ‌బ్బుకోసం అటువంటి ప‌నులు చేసిన‌ హీరోయిన్లు అమాయ‌కులెలా అవుతారు? అని అపూర్వ‌ ప్ర‌శ్నించారు.

తానా స‌భ‌లు పూర్తయిన త‌ర్వాత రెండు మూడు నెల‌ల పాటు కొంద‌రు హీరోయిన్లు అమెరికాలోనే తిష్ట వేశార‌ని - వారికి అక్క‌డేం ప‌ని ఉంద‌ని అపూర్వ సూటిగా ప్ర‌శ్నించారు. ఆ హీరోయిన్ల పాస్ పోర్టులు - వీసాలు - అమెరికాలో ఎన్ని ఈవెంట్ల‌లో పాల్గొన్నారు - బ‌స చేసిన హోట‌ళ్ల‌ వివ‌రాలు - బ్యాంకు ఖాతా వివ‌రాలు బ‌య‌ట‌పెడితే మ‌రిన్ని వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోవైపు, త‌న‌కెపుడూ అటువంటి స‌భ‌ల‌కు హాజ‌రు కావాల్సింది ఆహ్వానం అంద‌లేద‌ని కాదంబ‌రి కిర‌ణ్ అన్నారు. పేద న‌టీన‌టుల‌కు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న న‌టీన‌టుల‌కు కిర‌ణ్ గారు తోచిన సాయం చేస్తుంటార‌ని, అటువంటి వారిని తానా స‌భ‌ల‌కు పిల‌వ‌ర‌ని అపూర్వ అన్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉండే వ్య‌క్తుల‌నే తీసుకు వెళ‌తార‌ని చెప్పారు. ఎన్నారైల ద‌గ్గ‌ర పేద క‌ళాకారులకు సాయం చేయ‌డం కోసం కిర‌ణ్ గారు డొనేష‌న్లు అడుగుతార‌ని, అందుకే కిర‌ణ్ వంటి వారిని పిల‌వ‌ర‌ని చెప్పారు.