దోశలు తినేసి.. దూరం అంటున్న హీరోయిన్

Fri Feb 17 2017 23:08:38 GMT+0530 (IST)

అచ్చ తెలుగింటి అమ్మాయి అంజలి.. ముందు తమిళంలో గుర్తింపు సంపాదించి ఆ తర్వాత మనకి సీతమ్మగా మారిన సంగతి తెలిసిందే. గీతాంజలి లాంటి సోలో హిట్ తర్వాత కెరీర్ పీక్స్ కి వెళ్లిపోతున్న టైంలో.. పిన్ని- దర్శకుడు కళాంజియంతో వివాదాల కారణం ఈ భామ వెనకబడిపోయింది.త్వరలో అంజలి నటించిన చిత్రాంగద రిలీజ్ కానుండడంతో.. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సీతమ్మ.. తన గత వివాదాల గురించి అడక్కూడదనే కండిషన్ ముందే పెట్టింది. తాజాగా తమిళ హీరో 'జై'  చేతి దోశలు తిని తన ప్రేమ వ్యవహారాన్ని బైట పెట్టిందని అనుకుంటే.. ఈ మాత్రం 'ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ప్రస్తుతం ప్రొఫెషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయితే.. హీరోయిన్ గా ఉన్నపుడు పర్సనల్ మిస్ అవడం సహజం' అంటూ చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవాలనే తపన ఉండడంతో.. తన తొలి రెమ్యూనరేషన్ గా వేల రూపాయలే అందుకున్నా ఫీలవలేదట. 'నాకు బీఎండబ్ల్యూ కార్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారనే ప్రచారం ఉంది. అది నా డ్రీం. అందుకే నేను సొంతగా దాచుకుని కొనుక్కున్నా. అలాగే కోన వెంకట్ నా వెల్ విషర్స్ ఒకరు అంతే. నేను నటించిన బలుపు చిత్రానికి రైటర్ గాను.. గీతాంజలికి సహ నిర్మాతగాను ఉన్నారంతే' అని చెప్పింది అంజలి.