Begin typing your search above and press return to search.

సీతమ్మ.. తెగ చిక్కిపోయిందమ్మా!!

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:08 AM GMT
సీతమ్మ.. తెగ చిక్కిపోయిందమ్మా!!
X
తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ ప్రేక్షకులకు సీతమ్మ అయిపోయింది. ఒక్క పాత్రతో అంతగా మన జనాల మదిలో నిలిచిపోయిన ఈ బ్యూటీ.. ఆ రేంజ్ ను కొనసాగించలేకపోయినా.. ఇప్పటికీ ఈమెకు డిమాండ్ సామాన్యంగా ఉండదు. అయితే ఫిజిక్ విషయంలో అంజలిపై ముందు నుంచి కాసిన్ని విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.

ఇదుగో తగ్గిపోతున్నా లాంటి మాటలు తప్ప.. ఎక్కడా తన సైజ్ తగ్గించుకుంటున్నట్లుగా అసలు కనిపించదు ఈ గీతాంజలి. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ పెద్ద షాక్ ఇచ్చే రేంజ్ లో దర్శనం ఇచ్చేసింది. కొన్ని నెలల క్రితం విడుదల అయిన బెలూన్ మూవీలో కూడా బొద్దుగానే కనిపించిన ఈ భామ.. రీసెంట్ గా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసిన పిక్ లో మాత్రం మరీ సన్నబడిపోయింది. అంజలిని ఇంత చిక్కిన శరీరంతో చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఫ్యాన్స్ కి అయితే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు మా అంజలియేనా ఇలా మారిపోయింది అని ముందు సంశయించినా.. తర్వాత అర్ధం చేసుకుని ఆనందించేస్తున్నారు.

ఇంతకీ ఇంత సడెన్ గా అంజలి ఎందుకు సన్నబడిపోయిందనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏదైనా కొత్త సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేసిందా.. లేక ప్రియుడు జై అడిగాడని తగ్గిందా.. అభిమానుల కోరిక తీర్చాలని ఫిక్స్ అయిందో మాత్రం.. అంజలి చెబితేనే తెలుస్తుంది.