ఫోటో స్టొరీ: హాటెస్ట్ గర్ల్ ఇన్ శారీ

Mon Jun 24 2019 11:53:04 GMT+0530 (IST)

సీనియర్ హీరోయిన్ అనిత పేరు తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ నుండి కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అయింది కానీ ఓ 18 ఏళ్ళ క్రితం సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.. అప్పట్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అనిత లిస్టులో 'నువ్వు నేను' (2001) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.  రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్త ను 2013 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయింది.  ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.  ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టడం మాత్రం మానలేదు.ఈ భామ వయసు 38.. అయినా జిమ్ములో కసరత్తులు చేస్తూ.. కఠినమైన డైట్ ఫాలో అవుతూ స్లిమ్ముగా మెయింటెయిన్ చేస్తోంది. ఫేస్ లో కాస్త ఏజ్ కనిపిస్తోంది కానీ అందం చందం ఏమాత్రం తగ్గలేదు.  తాజాగా ఈ అనిత తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  బూడిద రంగు బ్లౌజ్.. అదే రంగులో మెరుస్తూ ఉండే చీర ధరించి సెక్సీ పోజిలిచ్చింది.  అందాలా ప్రదర్శన పెద్దగా చెయ్యకపోయినా ఆ సెక్సీ చీరకట్టుతోనే సోషల్ మీడియాపై సర్జికల్ స్ట్రైక్స్  చేసింది ఈ ఫోటోలకు "నేను చీరల్లోనే ఉండిపోగలను.. ఈ చీర చాలా నచ్చింది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  

ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరిపోయింది. "ఆప్ కీ సాడీ కా స్టైల్ మస్త్ హై".. "ఆకాశంలో మెరుస్తున్న తార".."హాటెస్ట్ గర్ల్ ఇన్ శారీ" అంటూ కామెంట్లు పెట్టారు.  మూడు లక్షల లైకులు కూడా కొట్టారు. ఇదిలా ఉంటే అనిత ప్రస్తుతం కలర్స్ టీవీలో వచ్చే 'ఖత్రా ఖత్రా ఖత్రా' అనే రియాలిటి షో లో పాల్గొంటోంది.