Begin typing your search above and press return to search.

పోలీసులకు లొంగిపోయిన అమలా పాల్

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:38 PM GMT
పోలీసులకు లొంగిపోయిన అమలా పాల్
X
అసలు హీరోయిన్ అమలా పాల్ విషయంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ సస్పెన్సే. అమ్మడు ఎన్ని స్టేట్మెంట్లు విడుదల చేసినప్పిటికీ అసలు లగ్జరీ కారు కొని పన్ను ఎగ్గొట్టిన కేసులో ఆమెకు అరెస్ట్ తప్పదనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు చాలా షాకింగ్ గా అమలా పాల్ ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయింది.

రాంగ్ అడ్రస్ ప్రూఫ్‌ సృష్టించి.. కేరళకు చెందిన అమలా పాల్ పాండిచ్చేరి రిజిస్ర్టేషన్ తో కారును రిజష్టర్ చేయించడం కారణంగా.. ఏకంగా రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆమెపై కేరళలో కేసు నమోదైంది. సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇన్నాళ్ళూ దీనిపై కామ్ గా ఉన్న అమల.. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకుంది. దానితో కోర్టు ఈమెను క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.. ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచిస్తాం అని చెప్పింది. దానితో చేసేదేం లేక.. అమల తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయింది.

అంతేకాదు.. తప్పుడు పత్రాలు చూపినట్లు ఒప్పుకున్నట్లు ఇప్పుడు మల్లూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడమంటే కస్సుమని జారుకుంది ఈ నటీమణి. ఇకపోతే ఈరోజు ఉదయం మరో కేరళ నటుడు సురేష్‌ గోపి కూడా పన్నుల ఎగవేత కేసులో అరెస్టయి రిలీజవ్వడం పెద్ద దుమారపే రేపింది. ఒక్కసారిగా మల్లూ సెలబ్రిటీలు ఇలా ఫోకస్ లో ఉండటంతో సినిమా లవ్వర్స్ అందరూ షాకైపోతున్నారు.