Begin typing your search above and press return to search.

నా ఎఫైర్ల గురించి చెప్పాలంటే టైమ్ సరిపోదు!

By:  Tupaki Desk   |   20 March 2019 6:29 AM GMT
నా ఎఫైర్ల గురించి చెప్పాలంటే టైమ్ సరిపోదు!
X
టాలీవుడ్లో 'రత్తాలు' గా పెరుతెచ్చుకున్న లక్ష్మీ రాయ్ ఈమధ్య 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే రాయ్ లక్ష్మి రీసెంట్ గా 'నీయా 2' అనే తమిళ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా పలు ఘాటు కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో లక్ష్మీ రాయ్ తరచుగా తన బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. బీచ్ లో.. ఇతర అందమైన లోకేషన్లలో వీలైనంతగా అందాలను ధారపోస్తూ నెటిజనులకు హీటెక్కిస్తూ ఉంటుంది. ఈ బికినీ ఫోటోల గురించి ప్రశ్నిస్తే.. 'నేను ఎక్కడికెళ్ళినా మెమొరీగా ఉంటుందని సెల్ఫీలు తీసుకుంటా. ఈమధ్య ముంబైలో ఉంటున్నా. అక్కడ బికినీ అనేది చాలా కామన్. నేను పోస్ట్ చేసింది ఆ ఫోటోలే. అవి పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినీలో చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి.' అంటూ గట్టిగా పంచ్ ఇచ్చింది.

మీ లవ్ ఎఫైర్స్ గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి కదా అని అడిగితే.. 'నా జీవితంలో జరిగిన విషయాలను నేను దాచి పెట్టను.. ఆలాగని పబ్లిక్ గా చెప్పుకోను. అయితే నేను చాలామందితో రిలేషన్లో ఉన్నమాట నిజమే' అంటూ బాంబు పేల్చింది. అంతే కాదు.. 'వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు' అంటూ మరో షాక్ ఇచ్చింది. ఈమధ్య మీకు ప్రెగ్నెంట్ అయ్యారని వార్తలు వినిపించాయి కదా అని అడిగితే పకాపకా నవ్వేసింది.. అవన్నీ జస్ట్ రూమర్లని కొట్టిపారేసింది. పెళ్ళి గురించి.. కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగితే తన భర్తను ఎంచుకోవడం పూర్తిగా తన ఛాయిస్ అని చెప్పింది. తన కుటుంబ సభ్యలు ఓపెన్ మైండెడ్ అని.. వాళ్ళు తనకు ఆ స్వేచ్చ ఇస్తారని తెలిపింది.