ఆటో డ్రైవర్లకు స్టార్ హీరో లంచ్

Mon May 27 2019 11:15:38 GMT+0530 (IST)

అదేంటో అభిమానుల మీద ప్రేమ చూపించే విషయంలో ఒక్కో హీరోది ఒక్కో స్టైల్. తమిళ స్టార్ విజయ్ ఈ విషయంలో తన ప్రత్యేకతను చూపిస్తూ ఉంటాడు. తాజాగా చెన్నైలో వందలాది ఆటో డ్రైవర్లకు లంచ్ ఆఫర్ చేసిన విజయ్ అది అయ్యాక ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా మెమెంటోలు కూడా ఇవ్వడం విశేషం. ఇది విజయ్ ప్రతి సంవత్సరం జరిపేదే. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇది చేపడుతూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరం సరిగ్గా ఆ సమయంలో ఎన్నికల కోలాహలం ఉండటంతో వాయిదా వేశాడు. అది ఇప్పటికి కుదిరింది.అతని విజయ్ మక్కల్ ఇయక్కుమ్ కో ఆర్డినేటర్ బుస్సీ ఆనంద్ ఆధర్వంలో నిన్న గ్రాండ్ గా ఇది జరిగింది. రుచికరమైన పదార్థాలతో సూపర్ అనిపించే మీల్స్ తో ఆటో డ్రైవర్లు యమా ఖుషిగా ఫుడ్ లాగించేశారు. దీనికి విజయ్ అటెండ్ కాలేకపోయాడు. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీపావళి రిలీజ్ ని టార్గెట్ చేశారు. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.

విజయ్ మార్కు మసాలాలు మిస్ చేయకుండానే అట్లీ దీన్నో ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. రాజా రాణితో మనవాళ్లకు దగ్గరైన అట్లీ రెండో సినిమా తేరి డబ్బింగ్ అయ్యింది కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీన్నే కొన్ని మార్పులు చేసి రవితేజతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మెర్సల్ సంగతి తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా దీని మీద చాలా అంచనాలే ఉన్నాయి