అక్కినేని వారింట విషాదం.. నాగ్ బావ మృతి

Thu May 18 2017 12:15:46 GMT+0530 (IST)

అక్కినేని వారింట విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నాగార్జున బావ అనుమోలు సత్యభూషణరావు (68) మృతి చెందారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్ లోని నివాసంలో బుధవారం  రాత్రి 11.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త అక్కినేని వారింట విషాదాన్ని నింపింది.

అక్కినేని నాగేశ్వరరావు.. అన్నపూర్ణ దంపతుల రెండో కుమార్తె అయిన సుశీలను సత్యభూషణరావుతో వివాహం జరిపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు. కరెంట్ మూవీతో హీరోగా వెండితెరకు సుశాంత్ పరిచయమయ్యారు.

సత్యభూషణరావు మరణవార్త విన్న వెంటనే చిత్రపరిశ్రమకు చెందిన పలువురు తమ సంతాపాన్ని అక్కినేని కుటుంబానికి తెలియజేశారు. పలువురు ప్రముఖులు భౌతికకాయాన్ని సందర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/