సేఫ్ సైడు.. 350 ఏస్కో.. నిజమేనా?

Thu Jun 21 2018 18:19:26 GMT+0530 (IST)

బయోపిక్స్ తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా ప్రస్తుతం జీవించి ఉన్న వారిపై సినిమా రూపొందించడం అంటే.. ఆ వ్యక్తుల గురించి అన్నీ నిజాలను చూపించడం అంటే.. బాలీవుడ్ మూవీ సంజును చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాణీ ఎంత కమిట్మెంట్ తో రూపొందించాడో కానీ.. తన జీవితాన్ని తెరిచిన పుస్తకం మాదిరిగా చూపించేందుకు సంజయ్ దత్ అంగీకరించడాన్ని మాత్రం ఎంతైనా అభినందిచవచ్చు.సంజు పాత్రలో రణబీర్ కపూర్ మెప్పించిన తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా.. ఈ మూవీ ట్రైలర్ లోని ఓ డైలాగ్ గురించి ఇప్పటికీ జనాలు చర్చించుకుంటూనే ఉన్నారు. మీరు ఇప్పటివరకూ ఎంతమందితో సెక్స్ చేశారు అనే ప్రశ్నకు.. 'ఆ.. వేశ్యలతో కాకుండా ఓ 309 ఉండొచ్చు.. సేఫ్ సైడు ఓ 350 వేస్కోండి' అంటూ రణబీర్ చెప్పిన డైలాగ్ సూపర్బ్ గా పేలింది. సంజయ్ దత్ కి ఇండస్ట్రీలో పెద్దన్నయ్య టైపు ఇమేజ్ ఉంది. అలాంటిది సంజయ్ దత్ కు ఇంత మంది అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు ఉన్నాయా అన్నదే ఆశ్చర్యకరమైన విషయం.

ఇప్పుడీ అంశంపై.. సంజు సినిమాలో హీరోకు మూడో భార్య మాన్యత పాత్రలో నటించిన దియా మీర్జా స్పందించింది. ఈ డైలాగ్ విని తాను కూడా ఆశ్చర్యపోయానని.. అంతమంది అమ్మాయిలతో సంజయ్ దత్ కు రిలేషన్ అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పింది దియా మీర్జా. ఈ డైలాగ్ వెనుక సీక్రెట్ తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్న ఈమె.. సంజయ్ దత్  విషయంలో మాన్యతా దత్ ను మాత్రం అభినందించింది. సంజు గురించి అన్ని విషయాలు తెలిసే ఆమె పెళ్లి చేసుకుందని అంటోంది దియా.