కాఫీ అందించే పాత్రలు ఇక చేయను

Sat Jun 16 2018 23:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లో స్టార్ నటీనటులు ఎంత మంది ఉన్నా కూడా కొంత మంది రెగ్యులర్ గా కనిపించే ఆర్టిస్ట్ లు ఉంటారు. మదర్ క్యారెక్టర్స్ తో కనిపించే నటీమణులకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. సినీ ప్రేక్షకులు కూడా వారిని ఎక్కడ చూసినా ఈజీగా గుర్తు పట్టేస్తారు. అలాంటి వారిలో ప్రగతి ఒకరు. మంచి ఆప్యాయత గల అమ్మగా నటించడంలో ప్రగతి ముందుంటారనే చెప్పాలి. నటనలో కూడా ఆమె ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు.అయితే గతంలో ఎక్కువగా కనిపించిన ప్రగతి ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ఎదో చిన్న చిన్న రోల్స్ కనిపించినప్పటికీ సినిమాలో ఆమె ఉన్నట్లు ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి ఒక విషయాన్ని చెప్పారు. ఒక ఏడాదిలో నేను 23 సినిమాలకు పైగా చేశాను. కానీ ఆ పాత్రలు ఎక్కువగా గుర్తింపు తేలేదు. ఎదో సన్నివేశంలో ఎదో ఇంటికి వచ్చిన అతిధులకు కాపీ ఇచ్చే పాత్రలే చేశాను. అవి నాకు చాలా విసుగు తెప్పించాయి అని ప్రగతి వివరించారు.

ప్రణతి దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు. వయసు ఎంత ఉన్నా కూడా అందంలో ఆమెను చూసి హీరోయిన్స్ కూడా కుళ్ళుకోవడం గ్యారెంటీ అనే టాక్ లకూడా ఉంది. ప్రస్తుతం తన పాత్రకు ఇంపార్టెంట్ ఉంటే తప్ప ఈ సీనియర్ నటి నటించను అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రగతి భర్త నుంచి విడిపోయి తన కుమారుడితో హైదరాబాద్ లోనే ఉంటున్నారు.