Begin typing your search above and press return to search.

చిన్నవాడా.. మరో రీమేక్ చేస్తున్నావా

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:34 AM GMT
చిన్నవాడా.. మరో రీమేక్ చేస్తున్నావా
X

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. స్వామిరారా సినిమా నుంచి మనోడు మంచి కథలను ఎంచుకుంటూ తన మార్కెట్ రేంజ్ ను కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు. మనోడి సినిమాలు ప్రస్తుతం మినిమమ్ వసూళ్లు సాధిస్తున్నాయి. చివరగా కేశవ సినిమాతో వచ్చిన ఈ యంగ్ హీరో నెక్స్ట్ రెండు రీమేక్ సినిమాలతో బిజీ కానున్నాడు.

ఇప్పటికే కన్నడ సినిమా కిరిక్ పార్టీని రీమేక్ చేయడానికి సిద్దమైన నిఖిల్ ఆ తర్వాత మరో తమిళ కథను రీమేక్ చేయబోతున్నాడు. 2016 లో కోలీవుడ్ లో రిలీజ్ అయిన కానితన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అక్కడ మంచి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఒక యువ జర్నలిస్ట్ చుట్టూ సాగే ఆ కథలో మంచి సందేశం కూడా ఉంటుంది. అలాంటి కథలో ఇప్పుడు నిఖిల్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇక ఒరిజినల్ కథను తెరకెక్కించిన దర్శకుడు టీఎన్.సంతోష్ రీమేక్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం నిఖిల్ కన్నడ సూపర్ హిట్ మూవీ కిరిక్ పార్టీ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కథను తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ప్రకారం మలిచారు. ఇక కానితన్ రీమేక్ లో మాత్రం తేడాలు ఏమి ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. క్యారెక్టర్స్ కోసం కొన్ని సీన్స్ లో తేడా ఉండవచ్చు కానీ కథను స్క్రీన్ ప్లేను ఏ మాత్రం మార్చే ఆలోచనలో దర్శకుడు లేడని తెలుస్తోంది.