Begin typing your search above and press return to search.

కిస్సు గురించి మా బాగా చెప్పారు!

By:  Tupaki Desk   |   18 Nov 2018 4:34 AM GMT
కిస్సు గురించి మా బాగా చెప్పారు!
X
అస‌లు కిస్సు లేని జీవితం ఒక జీవిత‌మేనా? ముద్దు ముచ్చ‌ట లేని బ‌తుకూ ఓ బ‌తుకేనా? కిస్సు కొట్ట‌డంలో రాజీకి వచ్చేస్తే.. క‌నీసం జీవితంలో 24 కిస్సులైనా లేక‌పోతే .. అస‌లు మ‌జా ఏమైనా ఉంటుందా? అలాంటి జీవితం జీవ‌త‌మేనా? విక్ర‌మార్కా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిసీ చెప్ప‌క‌పోయావో నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును! ఈ ధ‌ర్మ సందేహానికి స‌మాధానం దొర‌క‌డం చాలా క‌ష్టమేమీ కాద‌ట‌. కిస్సులోని సూక్ష్మ ధ‌ర్మాన్ని ఆయ‌న మా బాగా చెప్పాడు. కిస్సు కిస్స‌స్య కిస్సోన్మ‌స్య అన్నంత చ‌క్క‌గా కిస్సు గుట్టు విప్పాడు.

అస‌లు కిస్సు లేని జీవితం ఉందా? ఎవ‌రికైనా.. అని 24 కిస్సెస్ వేదిక సాక్షిగా అడిగేశాడు. అంతేకాదు.. మ్యారేజెస్ చెడిపోవ‌డానికి కార‌ణం ఫిజిక‌ల్ కాంటాక్ట్ లేక‌పోవ‌డ‌మే. మ‌న చుట్టూ చాలా కేసులు ఇలాంటివే. ఫిజిక‌ల్ కాంటాక్ట్ తో నే అంద‌మైన ఎమోష‌న్ మొద‌ల‌వుతుంది.. అంటూ ఎంతో పోయెటిక్‌ గా చెప్పారాయ‌న‌. ఇంత‌కీ ఎవ‌రీ బాబు? అంటే ఆయ‌నే సీనియ‌ర్ న‌రేష్. ఒక బ్యూటిఫుల్ ఎమోష‌న్‌ ని పోయెటిక్ గా తీసుకుని బోల్డ్ గా చెప్పిన‌ప్పుడు సందేహాలొస్తాయి. ఇది 2018 ఏజ్ .. కిస్ చేయ‌ని వాళ్లు ఉండ‌రు. ఉంటే చెప్పండి. నేను వ‌చ్చి కిస్ చేస్తాను అని అంతే బోల్డ్ గా ట్విస్టిచ్చారు ఈ సీనియ‌ర్ న‌టుడు.

కుమారి హెబ్బా ప‌టేల్ - ఆదిత్ జంట‌గా న‌టించిన `24 కిస్సెస్` ఈనెల 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. ఈ చిత్రానికి మిణుగురులు ఫేం అయోధ్య కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తోంది. 24 కిస్సెస్ టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా ప్రీరిలీజ్ ఈవెంట్‌ లో ముద్దు గురించి ఒక్కొక్క‌రూ ఒపీనియ‌న్స్ చెబుతూ సీనియ‌ర్ న‌రేష్ ఒపీనియ‌న్ విన్న తర్వాత క‌ర‌తాళ ధ్వ‌నులతో మోతెక్కించేస్తున్నారంతే!!