సారు బ్రహ్మోత్సవాన్ని మర్చిపోయారు

Thu Jun 14 2018 23:00:01 GMT+0530 (IST)

ఏదైనా హాట్ టాపిక్ అయినప్పుడు ఇంకా ముందు ఏం జరుగుతుంది అనే విషయాలలో అందరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆటలైనా రాజకీయాలైనా ముందుగా ఏం జరుగుతుందో చెప్పేవాళ్లని ప్రెడిక్షన్ స్పెషలిస్ట్ అని పిలవడం అందరికి తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఇప్పుడు ఒకరు ప్రెడిక్షన్ స్పెషలిస్ట్ గా చలామణి అవుతున్నారు. ఆయన మరెవరో కాదు. సీనియర్ నటులు - విజయ నిర్మల కుమారుడు నరేష్.గత కొంత కాలంగా నరేష్ చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. రీసెంట్ గా సమ్మెహనం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నరేష్ అందరిని ఆకట్టుకునేలా ఒక టాక్ వదిలారు. గతంలో తాను చెప్పిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయని. చలో - తోలిప్రెమ - రంగస్థలం - భరత్ అను నేను అలాగే మహానటి సినిమాలు హిట్ అవుతాయని చెప్పగానే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు సమ్మోహనం కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని నరేష్ చెప్పారు. అయితే ఎదో సినిమాపై మక్కువతో ఆయన అలా చెప్పలేదట. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ అండ్ సుదీర్ బాబు నటనను చూసి అలా జడ్జిమెంట్ ఇచ్చారట. బాగానే ఉంది.

గతంలో నరేష్ ఇదే తరహాలో బ్రహ్మోత్సవం సినిమాకు కూడా ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. అద్భుతహా అమోఘం అంటూ కామెంట్లు చేశారు. కాని ఆ సినిమా రిలీజయ్యాక మహేష్ కెరియర్లో అప్పటికి బిగ్గెస్ట్ డిజాష్టర్ గా నిలిచింది. అందుకే ఈయన ప్రెడిక్షన్ పక్కాగా నిజం అవుతుంది అనుకోవడానికి లేదు. అలాగే ఇంకొన్ని ఇతర సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయ్. అంటే.. కేవలం కంటెంట్ ఇంప్రెస్ చేస్తే సినిమా ఆడుతోంది.. ప్రెడిక్షన్ వలన కాదు. అలాగే ఒక క్యారక్టర్ నటుడికి పూర్తి స్థాయిలో సినిమా కంటెంట్ ఏంటో తెలిసే ఛాన్సే లేదు.