Begin typing your search above and press return to search.

హాట్ యాంకర్ ఫ్రెండ్ తో నందు రొమాన్స్

By:  Tupaki Desk   |   31 Aug 2016 9:30 AM GMT
హాట్ యాంకర్ ఫ్రెండ్ తో నందు రొమాన్స్
X
గుంటూరు టాకీస్ తో టాలీవుడ్ ని వేడెక్కించిన హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభం కానుండగా.. ట్యాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న నందు ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. రష్మీతో తన కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా కనిపించనుందని అంటున్నాడు నందు.

'గతంలో మేమిద్దరం కలిసి చాలానే కార్యక్రమాలను హోస్ట్ చేశాం. నిజానికి రష్మీ నేను మంచి ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు ఆమెతో సినిమా.. అందులోనూ రొమాంటిక్ మూవీ అంటే ఖచ్చితంగా ఆకట్టుకునే విషయమే' అని చెప్పాడు నందు. అలా రష్మీతో రొమాన్స్ చేయబోతున్నట్లు చెప్పాడు నందు. కొత్త దర్శకుడు ప్రభాకరన్ ఈ మూవీని తెరకెక్కించనుండగా.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 'అబ్బాయి-అమ్మాయి కలుసుకోవడం అనే కాన్సెప్ట్ తో కాకుండా.. ఓ జంటకు రిలేషన్ మొదలయ్యాక.. వారి మధ్య విబేధాలను బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుంది' అని చెప్పాడు నందు.

రీసెంట్ గా భారీ హిట్ సాధించిన స్మాల్ మూవీ పెళ్లి చూపులులో స్పెషల్ రోల్ చేసిన తర్వాత తనకు బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయని.. అలా వచ్చిన ఆఫర్లలో సెట్స్ పైకి వెళుతున్న తొలి చిత్రం ఇదే అని చెబుతున్నాడు నందు.