Begin typing your search above and press return to search.

క్యారెక్టర్ ఆర్టిస్టు గుర్రమెక్కుతున్నాడుగా..

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:35 AM GMT
క్యారెక్టర్ ఆర్టిస్టు గుర్రమెక్కుతున్నాడుగా..
X
టాలీవుడ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటనానుభవంతో పాటు మంచి కమిట్ మెంటు ఉన్న నటుడు బ్రహ్మాజీ. ఏ రకమైన పాత్ర అయినా రక్తి కట్టించగలడు. అలాంటి బ్రహ్మాజీ తన నట జీవితంలో ఇంతవరకూ ఎప్పుడు చెయ్యని పని చేయాల్సి వచ్చింది. తన కెరీర్ లో తొలిసారి గుర్రపు స్వారీ అవసరం పడటంతో అర్జంటుగా ఆ పనిలో పడ్డాడు.

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాలో బ్రహ్మాజీ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. సైరా సినిమా బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో సినిమాలో గుర్రపు స్వారీ సీన్లు చాలానే ఉంటాయి. ఇంతవరకు చేసిన ఏ సినిమాలోనూ బ్రహ్మాజీకి గుర్రం ఎక్కాల్సిన అవసరం రాలేదు. ఇఫ్పుడు సైరా మూవీలో పాత్రకున్న ప్రాధాన్యం దృష్ట్యా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు. ‘‘రోజూ రెండు గంటలపాటు క్లాసులకు వెళుతున్నాను. ఎలాంటి బెరుకు లేకుండా గుర్రంపై పరుగు తీయడానికి మరో నెలరోజుల దాకా పట్టచ్చేమో.. సైరా తరవాత షెడ్యూల్ వచ్చే నెలలో కేరళలో స్టార్టవుతుంది. అప్పటికి స్వారీ పర్ ఫెక్ట్ గా వచ్చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు బ్రహ్మాజీ.

చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలొదిలిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బ్రహ్మాజీ గుండుతో కనిపించనున్నాడు.