వాల్మీకి ఫ్రెండు మామూలోడు కాదు

Tue Jun 25 2019 12:31:40 GMT+0530 (IST)

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఎక్కువగా చర్చలో ఉన్న టాపిక్ వాల్మీకిలో వరుణ్ తేజ్ లుక్ గురించి. ఇప్పటిదాకా చేసిన పాత్రలకు భిన్నంగా ఓవర్ మాస్ అనిపించేలా ఊర నాటు లుక్ లో మెగా ప్రిన్స్ దర్శనమిచ్చే సరికి అందరు షాక్ తిన్నారు. పోస్టర్లు కూడా బాగానే వైరల్ అయ్యాయి. వరుణ్ చేసింది ఒరిజినల్ లో బాబీ సింహా చేసిన పాత్ర. అది కొంత నెగటివ్ షేడ్స్ తో ఉంటుంది. హీరో సిద్ధార్థ. కానీ సినిమా పూర్తయ్యాక బాబీ సింహానే గుర్తుండిపోతాడు. అంత ప్రభావం చూపించేది కాబట్టే వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ ఒప్పుకున్నాడు. దానికి తగ్గట్టే దర్శకుడు హరీష్ శంకర్ చాలా మార్పులే చేసినట్టుగా టాక్ ఉంది.మరి సిద్దార్థ్ పాత్ర చేసిన తమిళ హీరో అధర్వ మాత్రం ఎక్కడా హై లైట్ అవ్వడం లేదు. నిన్న వదిలిన పోస్టర్స్ లో తనకూ సమాన ప్రాధాన్యం ఇచ్చి లుక్ ని రివీల్ చేశారు. అవగాహన లేకపోవడంతో ఇతను ఎవరా అని అనుకున్న వాళ్లే ఎక్కువ అధర్వ ప్రముఖ సీనియర్ హీరో మురళి రెండో అబ్బాయి. అప్పట్లో హృదయం లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తో మనకూ బాగా దగ్గరయ్యాడు. అధర్వ తాతయ్య సిద్ధలింగయ్య సుప్రసిద్ధ కన్నడ నిర్మాత. కుటుంబ మూలాలు కర్ణాటకలో ఉన్నప్పటికీ చెన్నై వచ్చి సెటిల్ అయిపోయారు.

మొదటి సినిమా బాణ కాతడితో 2010లో అవార్డులు రివార్డులు అందుకున్న అధర్వ అదే పనిగా సినిమాలు ఒప్పుకోడు. ఇటీవలే నయనతార డబ్బింగ్ మూవీ అంజలి సిబిఐలో ఆమె తమ్ముడిగా రాశి ఖన్నా లవర్ గా కనిపించింది ఇతగాడే. ఇప్పుడు వాల్మీకిలో కూడా తనదైన ముద్ర వేసే అవకాశం లేకపోలేదు. కాకపోతే శిఖరం లా కనిపిస్తున్న వరుణ్ లుక్ ముందు ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. కథ ప్రకారం అధర్వ ఇందులో ఫిలిం మేకర్ గా కనిపిస్తాడు. ఇతనికి వరుణ్ తేజ్ కి మధ్య జరిగే ట్రాక్ మీద సినిమా ఫన్ మొత్తం ఆధారపడి ఉంటుంది.