Begin typing your search above and press return to search.

మసాలా శంకరా యాక్షన్ కేకెనా ?

By:  Tupaki Desk   |   14 July 2019 5:30 PM GMT
మసాలా శంకరా యాక్షన్ కేకెనా ?
X
వచ్చే గురు శుక్రవారాలు మరో రసవత్తర పోరుకి రెడీ అవుతున్నాయి. ప్రతి వారం కనీసం మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు విడుదలవుతున్న తరుణంలో ప్రేక్షకులు ఒకదాని గురించి పూర్తిగా తెలుసుకునే లోపే మరొకటి థియేటర్లలో నిలవడం కష్టమైపోతోంది. స్టార్ బ్రాండ్ ఉంటే అంతో ఇంతో నిలబెట్టుకోవచ్చు కానీ లేదంటే చిక్కులు తప్పడం లేదు. ఈసారి మాత్రం కొంత పోటీ గట్టిగానే ఉండేలా ఉంది.

ఎనర్జిటిక్ హీరో రామ్ పూరిల కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ గురువారమే 18న రానుంది. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ లో ఊర మాస్ కంటెంట్ అనే క్లారిటీ పూర్తిగా ఇచ్చేశారు. అయితే దీని గురించి ఇటు నెగటివ్ గానూ అటు పాజిటివ్ గానూ మిశ్రమ స్పందన లభించింది. మొదటి ఆట కాగానే టాక్ బాగా వస్తే వసూళ్లకు లోటు ఉండదు. కాదంటేనే సమస్యలు

ఇక ఒక్క రోజు గ్యాప్ తో విక్రమ్ మిస్టర్ కేకే వస్తోంది. దీని మీద ఎలాంటి అంచనాలు లేవు. హీరో మార్కెట్ బాగా డౌన్ లో ఉన్న కారణంగా రిలీజ్ కూడా లిమిటెడ్ గానే దక్కే ఛాన్స్ ఉంది. చాలా బాగుంది అనే రిపోర్ట్ వస్తే విక్రమ్ నిలబెట్టుకుంటాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఇలాంటి సినిమాలతో అన్ని వర్గాలను మెప్పించడం అంత ఈజీ కాదు. మరి మిస్టర్ కేకే ఎంతవరకు పోటీ ఇస్తాడు అనేది వేచి చూడాలి.

రీజనబుల్ గా బిజినెస్ జరగడంతో బయ్యర్లు అంతో ఇంతో ఆశలు పెట్టుకున్నారు. కమల్ హాసన్ నిర్మాత అనే ఫ్యాక్టర్ పెద్దగా పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్-మిస్టర్ కేకేల మధ్య యుద్ధం ఎలా ఉంటుంది అనేది ఇంకో ఐదు రోజుల్లో తేలిపోతుంది. ఇవి కాకుండా అమల పాల్ ఆమె హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ కూడా రేస్ లో ఉన్నాయి