Begin typing your search above and press return to search.

మీటూ ఎఫెక్ట్.. యాసిడ్ అటాక్ చేస్తారట..

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:14 AM GMT
మీటూ ఎఫెక్ట్.. యాసిడ్ అటాక్ చేస్తారట..
X
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సినిమా ఇండస్ట్రీలో జరిగిన లైంగిక వేధింపులను గాయని చిన్మయి బయటపెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమెకు వరుస బెదిరింపులు వస్తున్నాయట.. ఈ మేరకు తాజాగా చెన్నైలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపులపై ట్విట్టర్ లో బాధితుల ఆరోపణలు చూపిస్తే తనను చంపేస్తామంటూ.. యాసిడ్ పోస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయారు. ప్రశ్నలతో తనను వేధిస్తున్నారని.. ఇప్పుడెందుకు పాత విషయాలు చెబుతున్నావని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. మహిళల గొంతు నొక్కే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు.

ప్రముఖ గీత రచయిత వైరముత్తు చాలా మంది స్త్రీలను లైంగికంగా వేధించాడని.. అతడిపై ఆధారాలు సేకరించి కేసు వేస్తానని చిన్మయి స్పష్టం చేశారు. మహిళల రక్షణకే మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతానని తెలిపారు.

తాజాగా కోలీవుడ్ లోనూ మీటూ ప్రకంపనలు రేపుతోంది. నటుడు జాన్ విజయ్ - మ్యూజిక్ డైరెక్టర్ ఉమాశంకర్ పై బుల్లితెర యాంకర్ శ్రీరంజిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.